ప్లాస్మాథెరపీ ప్రయోగ దశలోనే ఉంది....

దేశంలో ప్లాస్మా థెరపీ ఇంకా ప్రమోగదశలోనే ఉందని, దాని వల్ల వైరస్ తగ్గుముఖం పడుతుందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఇందుకోసం జాతీయస్థాయిలో భారత వైద్య పరిశోధనా మండలి..... 

Updated : 28 Apr 2020 17:54 IST

భారత్‌లో 24 గంటల్లో 1543 కొత్త కేసులు

దిల్లీ: గడచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 1543 కరోనా కేసులు నమోదుకాగా, 684 మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్ తెలిపారు. దీంతో భారత్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 29,435కు చేరుకుందని తెలిపారు. వీరిలో 6,869 మంది కోలుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం కరోనా రోగుల రికవరీ రేటు 23.3 శాతంగా ఉందని పేర్కొన్నారు. గత 28 రోజుల్లో 17 జిల్లాల్లో కొత్త కేసులు  నమోదు కాలేదని, రోజు రోజుకి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుందని ఆయన వెల్లడించారు. 

దేశంలో ప్లాస్మా థెరపీ ఇంకా ప్రయోగదశలోనే ఉందని, దాని వల్ల వైరస్ తగ్గుముఖం పడుతుందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఐసీఎంఆర్‌ అధ్యయనం తర్వాత, పూర్తి స్థాయిలో శాస్త్రీయ ఆధారాలు లభించేంత వరకు ప్లాస్మా థెరపీని ప్రయోగాలకు, పరిశోధనలకే పరిమితం చేస్తామని వెల్లడించారు.  ప్లాస్మా థెరపీని సరైన పద్ధతిలో, మార్గదర్శకాలు లేకుండా ప్రయోగిస్తే రోగి ప్రాణాలకు ప్రమాదం సంభవించే అవకాశం ఉందన్నారు.  దీనిని రోగులకు ఉపయోగించేందుకు అనుమతించే వరకు ఎవ్వరూ ఈ థెరపీని ఉపయోగించకూడదని, అది ప్రమాదకరం, చట్ట విరుద్ధం అని హెచ్చరించారు.

ఇవీ చదవండి...

ఐసీఎంఆర్‌ నిర్ణయంపై చైనా ఆందోళన

కరోనా: ఇక ఆ పోలీసులు విధులకు దూరం..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని