ఇండోనేషియాకు మోదీ హామీ

అంతరాయం లేకుండా అవసరమైన వైద్య ఉత్పత్తులను ఎగుమతి చేస్తామని ఇండోనేషియా అధ్యక్షుడు జొకో విడోడోకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. కొవిడ్‌-19పై పోరుకు సహకారం అందజేస్తామని వెల్లడించారు. రెండు దేశాల్లోని వివిధ అంశాలపై ఇద్దరూ చర్చించుకున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు నిరంతరం...

Published : 28 Apr 2020 19:16 IST

దిల్లీ: అంతరాయం లేకుండా అవసరమైన వైద్య ఉత్పత్తులను ఎగుమతి చేస్తామని ఇండోనేషియా అధ్యక్షుడు జొకో విడోడోకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. కొవిడ్‌-19పై పోరుకు సహకారం అందజేస్తామని వెల్లడించారు. రెండు దేశాల్లోని వివిధ అంశాలపై ఇద్దరూ చర్చించుకున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు నిరంతరం అందుబాటులో ఉండేందుకు రెండు దేశాల నేతల అంగీకరించారు.

‘కొవిడ్‌-19 మహమ్మారి గురించి మంచి మిత్రుడు, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోతో చర్చించాను’ అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. కరోనా మహమ్మారితో ఏర్పడిన ఆర్థిక, వైద్య సవాళ్లను ఎదుర్కొనేందుకు సన్నిహిత సముద్రతీర దేశాలు, సమగ్ర వ్యూహాత్మక భాగస్వాములైన భారత్‌, ఇండోనేషియా మధ్య సహకారం అవసరమని ఆయన పేర్కొన్నారు.

‘కరోనా నివారణ, చికిత్సకు అవసరమైన వైద్య సామగ్రి, ఇతర వస్తువులు, ఔషధాలను అంతరాయం లేకుండా అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు’ అని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. రంజాన్‌ నెల కావడంతో ఆ దేశ అధ్యక్షుడికి  మోదీ శుభాకాంక్షలు తెలియజేశారని వెల్లడించింది.

చదవండి: తబ్లిగీలు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు

చదవండి: అమెరికాపై చైనా ప్రతిదాడి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని