కార్మికులజీతాలకు ప్రభుత్వమే భద్రత కల్పించాలి

లాక్‌డౌన్‌ కారణంగా వివిధ రంగాలకు చెందిన సంస్థల యజమానులు తమ ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితి నెలకొందని, వారిని ఆదుకోనేందుకు ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని ప్రకటించాలని కాంగ్రెస్ సీనియర్‌ నాయకుడు పి. చిదంబరం కేంద్రాన్ని అభ్యర్థించారు.....

Updated : 29 Apr 2020 17:55 IST

దిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా వివిధ రంగాలకు చెందిన సంస్థల యజమానులు తమ ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితి నెలకొందని, వారిని ఆదుకోనేందుకు ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని ప్రకటించాలని కాంగ్రెస్ సీనియర్‌ నాయకుడు పి. చిదంబరం కేంద్రాన్ని అభ్యర్థించారు. అలానే కాంగ్రెస్ పార్టీ సూచించిన మేరకు చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని కోరారు. కరోనా మహ్మమారిపై సమర్థవంతంగా పోరాడేందుకు రాష్ట్రాలకు ఆర్థిక సహాయాన్ని అందిచాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచించారు. లాక్‌డౌన్‌తో వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను వారి ప్రాంతాలకు తరలించే దిశగా కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కోరారు. 

 ‘‘ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో పరిశ్రమలను ప్రభుత్వం తప్పక ఆదుకోవాలనే స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రైవేటు రంగ సంస్థలు పెద్ద ఎత్తున్న తొలగింపులు, ఉపసంహరణలు చేపడుతున్నాయి. ఈ పరిస్థితి వల్ల కోట్లాది మంది ప్రజల జీవితాలు నాశనం అవుతాయి. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న 12 కోట్ల మంది ఉద్యోగుల ఏప్రిల్ నెల జీతాలకు భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి’’ అని చిదంబరం ప్రభుత్వాన్ని కోరారు. అలానే కార్మికుల కోసం పేచెక్‌ ప్రొటెక్షన్ ప్రొగ్రామ్‌ను ఆయన సూచించారు. కార్మికుల జీతాలకు భద్రత కల్పించేందుకు, రాబోయే రోజులకు చెల్లించాల్సిన జీతాలను పేచెక్‌ ద్వారా కార్మికులకు చెల్లించడం కోసం సంస్థలకు ప్రభుత్వం ప్రత్యేక సహాయాన్ని అందించాలని ప్రధాని నరేంద్ర మోదీని అభ్యర్థిస్తున్నట్లుగా చిదబంరం పేర్కొన్నారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని