మోదీని ‘అన్‌ఫాలో’ చేసిన వైట్‌హౌజ్‌

భారత ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని కార్యాలయం ట్విటర్‌ ఖాతాలను వైట్‌హౌజ్‌ అన్‌ఫాలో చేసింది. అమెరికాలోని భారత దౌత్యకార్యాలయం ఖాతానూ అనుసరించడం మానేసింది. ఇందుకు గల  కారణాలేంటో వెల్లడించలేదు. మూడు వారాల క్రితం వైట్‌హౌజ్‌ అనుసరిస్తున్న ఏకైక....

Published : 29 Apr 2020 18:59 IST

ముంబయి: భారత ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని కార్యాలయం ట్విటర్‌ ఖాతాలను వైట్‌హౌజ్‌ అన్‌ఫాలో చేసింది. అమెరికాలోని భారత దౌత్యకార్యాలయం ఖాతానూ అనుసరించడం మానేసింది. ఇందుకు గల  కారణాలేంటో వెల్లడించలేదు. మూడు వారాల క్రితం వైట్‌హౌజ్‌ అనుసరిస్తున్న ఏకైక ప్రపంచ నేతగా ప్రధాని మోదీ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

వైట్‌హౌజ్‌ అమెరికా అధ్యక్షుడి నివాసభవనం. ప్రస్తుతం వైట్‌హౌజ్‌ ట్విటర్‌ ఖాతాను దాదాపు రెండు కోట్ల మంది అనుసరిస్తున్నారు.ఏప్రిల్‌ 10 నుంచి వైట్‌హౌజ్‌ మోదీని అనుసరించడం మొదలుపెట్టింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, మోదీ మధ్య స్నేహం, సౌభ్రాతృత్వానికి చిహ్నంగా ఇలా చేసింది. ఆ తర్వాత ట్రంప్‌ కోరిక మేరకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఎగుమతులపై ఆంక్షలను మోదీ సడలించిన సంగతి తెలిసిందే.

చదవండి: రాహుల్‌.. చిదంబరంతో ట్యూషన్‌ చెప్పించుకో

చదవండి: వ్యాక్సిన్‌ తయారీకి కృత్రిమ మేధ సహకారం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని