దేశంలో కూరగాయల కొరత లేదు

దేశంలో కూరగాయల కొరత లేదని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ బుధవారం వెల్లడించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎవరు కూడా కూరగాయలు లేక..

Published : 29 Apr 2020 22:46 IST

స్పష్టం చేసిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి

 

దిల్లీ: దేశంలో కూరగాయల కొరత లేదని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ బుధవారం వెల్లడించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎవరు కూడా కూరగాయలు లేక ఇబ్బంది పడటం లేదని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో తోమర్‌ మాట్లాడుతూ.. ‘వ్యవసాయ రంగంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. సంక్షోభ సమయంలో వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ ముఖ్య భూమిక పోషిస్తుంది. ప్రస్తుతానికి ఎవరు కూడా కూరగాయల కొరతను ఎదుర్కోవడం లేదు’ అని వెల్లడించారు. ఈ సంక్షోభ సమయంలోనూ రైతులకు  వ్యవసాయ శాఖ రూ.17,986 కోట్లు బదిలీ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని