టిక్‌ టాక్‌@200కోట్ల డౌన్‌లోడ్‌లు

ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఆకర్షిస్తోన్న ప్రముఖ వీడియో షేరింగ్‌ యాప్‌ ‘టిక్‌ టాక్‌’ మరో మైలురాయి దాటింటి. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఈ యాప్‌ను 200కోట్ల సార్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు ప్రముఖ అనలెటిక్స్‌ సంస్థ సెన్సార్‌ టవర్‌ వెల్లడించింది.

Published : 30 Apr 2020 17:24 IST

దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఆకర్షిస్తోన్న ప్రముఖ వీడియో షేరింగ్‌ యాప్‌ ‘టిక్‌ టాక్‌’ మరో మైలురాయి దాటింటి. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఈ యాప్‌ను 200కోట్ల సార్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు ప్రముఖ అనలెటిక్స్‌ సంస్థ సెన్సార్‌ టవర్‌ వెల్లడించింది. కరోనా వైరస్‌ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ప్రజలు లాక్‌డౌన్‌ కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో కేవలం ఈ త్రైమాసికంలోనే యాపిల్‌ యాప్ స్టోర్‌, గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి దాదాపు 31కోట్ల సార్లు డౌన్‌లోడ్‌ అయినట్లు సెన్సార్‌ టవర్‌ పేర్కొంది. ముఖ్యంగా భారత్‌, చైనా, అమెరికాల్లోనే అత్యధికంగా ఈ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నారని తెలిపింది. సినిమా డైలాగులు, నృత్యాల వంటి సరికొత్త ఫీచర్లతో వచ్చిన టిక్‌ టాక్‌ యాప్‌ అనతికాలంలోనే విశేష ప్రజాదరణ పొందింది. చైనాకి చెందిన బైట్‌డాన్స్‌ కంపెనీ ఈ సామాజిక మాధ్యమ యాప్‌ను నిర్వహిస్తోండగా.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40భాషల్లో ఈ యాప్‌ కనువిందు చేస్తోంది.

అయితే, ఈ యాప్‌కు 200కోట్ల డౌన్‌లోడ్‌లు ఉన్నప్పటికీ క్రియాశీల వినియోగదారుల సంఖ్యలో మార్పు ఉండే అవకాశం ఉంది.

ఇవీ చదవండి..

కిమ్‌ మృతిపై అప్పట్లోనూ వార్తలే వార్తలు

‘ఆరోగ్య సేతు’ యాప్‌ డౌన్‌లోడ్‌ల సంఖ్య తెలుసా!

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని