ఫోన్‌ కొంటే ఆరోగ్యసేతులో నమోదు తప్పనిసరి

ఇక మీదట కొత్త మొబైల్‌ ఫోన్‌ వినియోగించే వారు విధిగా తమ వివరాలను ఆరోగ్య సేతు యాప్‌లో రిజిష్టర్ చేసుకోవాలట. లాక్‌డౌన్‌ తర్వాత దేశంలో అమ్ముడయ్యే ప్రతి కొత్త స్మార్ట్‌ఫోన్‌లో ముందస్తు సేవల కింద ఆరోగ్య సేతు యాప్‌ ఉంటుందని...

Published : 01 May 2020 01:23 IST

దిల్లీ: ఇక మీదట కొత్త మొబైల్‌ ఫోన్‌ వినియోగించే వారు విధిగా తమ వివరాలను ఆరోగ్య సేతు యాప్‌లో రిజిష్టర్ చేసుకోవాలట. లాక్‌డౌన్‌ తర్వాత దేశంలో అమ్ముడయ్యే ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో ముందస్తు సేవల కింద ఆరోగ్య సేతు యాప్‌ ఉంటుందని సమాచారం. కొత్త ఫోన్‌ కొనుగోలు చేసినవారు దానిని ఉపయోగించడానికి ముందు యాప్‌లో తప్పనిసరిగా తమ వివరాలను రిజిస్టర్‌ చేసుకోవాలి. త్వరలోనే కేంద్రం ఈ నిబంధనను అమలులోకి తేనుందట. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు ఒక ఆంగ్ల వార్తా సంస్థకు తెలిపారు. దీని అమలు కోసం కేంద్రం త్వరలోనే కొత్త నోడల్‌  ఏజెన్సీని కూడా ఏర్పాటు చేయనుంది. ఈ ఏజెన్సీ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీలతో సమయన్వయం చేసుకుంటూ, యాప్‌ను అన్ని స్మార్ట్‌ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేసేవిధంగా చర్యలు తీసుకుంటుందట.

ఈ మేరకు వినియోగదారులు తప్పనిసరిగా వివరాలు రిజిష్ట్రర్‌ చేసుకునే విధంగా ఫోన్లలో కూడా మార్పులు చేయనున్నారు. దీంతో దేశవ్యాప్తంగా అమ్ముడయ్యే అన్ని స్మార్ట్‌ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్‌ ఇన్‌బిల్ట్‌ ఫీచర్ కింద అందివ్వనున్నారు. కరోనా ముప్పుపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు రూపొందించిన ఈ యాప్‌ను దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 7.5 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. రాబోయే రోజుల్లో మరింత మంది డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలానే కరోనా ముప్పుపై హెచ్చరించేందుకు ఫీచర్‌ ఫోన్ల కోసం కూడా కొత్త సాంకేతికతను రూపొందిస్తున్నట్లు కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. త్వరలోనే ఈ సాంకేతికతను ప్రజలకు అందుబాటులోకి తేస్తామన్నారు. 

ఇవీ చదవండి...

మోదీ ట్విటర్‌ అన్‌ఫాలోపై వైట్‌హౌజ్‌ క్లారిటీ!

కరోనా పోరు: భారత్‌కు అమెరికా భారీ సాయం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని