
పాక్ స్పీకర్‌కు కరోనా పాజిటివ్
నిబంధనల ఉల్లంఘనే కారణం!
ఇస్లామాబాద్: పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ అసద్ ఖైజర్‌కు కరోనా వైరస్ సోకినట్లు శుక్రవారం నిర్ధారణ అయ్యింది. ఆయనతో పాటు కూతురు, కొడుకు కూడా వైరస్ పాజిటివ్‌గా తేలినట్లు ఆయన సోదరుడు వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా స్పీకర్ ఇటీవల తన ఇంట్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. దీంట్లో పాల్గొన్న ఆయన బావ, చెల్లికి వైరస్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో అంతా అప్రమత్తమయ్యారు. విందులో పాల్గొన్న వారంతా పరీక్షలు చేయించుకోగా.. స్పీకర్ సహా ఆయన కొడుకు, కూతురుకు వైరస్ సోకిన విషయం బయటపడింది.
ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ పాకిస్థాన్‌లోనూ విజృంభిస్తోంది. గురువారం అత్యధికంగా 990 మందికి వైరస్ సోకినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఒక్కరోజు వ్యవధిలో 24 మంది మృతిచెందినట్లు తెలిపింది. దీంతో అక్కడ మృతుల సంఖ్య 385కు పెరిగింది. ఇక పాజిటివ్ కేసుల సంఖ్య 16,817కు చేరింది. పాక్‌లో వైరస్ సోకిన ఉన్నతస్థాయి నాయకుల్లో స్పీకర్ అసద్ ఖైజర్ రెండోవారు. ఇంతకుముందు సింధ్ ప్రావిన్స్ గవర్నర్ కూడా వైరస్ బారినపడ్డారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Technology News
WhatsApp: మహిళల కోసం వాట్సాప్‌లో కొత్త సదుపాయం
-
Sports News
Pakistan: ఒకరు విజయవంతమైతే.. మా సీనియర్లు తట్టుకోలేరు: పాక్ క్రికెటర్
-
Movies News
Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
-
World News
Ukraine Crisis: జీ-7 సదస్సు వేళ.. కీవ్‌పై విరుచుకుపడిన రష్యా!
-
General News
Health: వృద్ధాప్యం వస్తే ఏం తినాలో తెలుసా..?
-
India News
Election Commission: పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేసే అధికారం మాకివ్వండి: ఈసీ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Chiranjeevi: నాకూ గోపీచంద్‌కు ఉన్న సంబంధం అదే: చిరంజీవి
- Bypolls: యూపీలో భాజపాకు బిగ్ బూస్ట్.. పంజాబ్‌లో ఆప్‌కు భంగపాటు
- E Passport: ఈ పాస్‌పోర్ట్‌లు వస్తున్నాయ్.. ఎప్పటి నుంచి జారీ చేస్తారు?ఎలా పనిచేస్తాయి?
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- PCOD: అధిక బరువుకు బై బై చెప్పేద్దామా.. పరిష్కార మార్గాలివిగో..!
- Droupadi Murmu: ఎట్టకేలకు మోక్షం.. ద్రౌపదీ ముర్ము స్వగ్రామానికి కరెంటు..!
- Matoshree: మాతోశ్రీకి ఎందుకు తిరిగి వచ్చారంటే?
- అక్కడి మహిళలు ఆ ఒక్క రోజే స్నానం చేస్తారట!
- Ukraine Crisis: యుద్ధ భూమిలో వివాహ వేడుకలు.. ఒక్కటవుతున్న వేలాది జంటలు