ప్లాస్మాథెరపీ ఫలితాలనిస్తోంది: కేజ్రీవాల్

ప్రస్తుత పరిస్థితుల్లో ప్లాస్మాథెరపీ ప్రయోగాలు నిలిపివేయడం కుదరదని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ క్రేజీవాల్ స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ రోగుల్లో ఇది ప్రభావంతంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఇటీవల వైరస్‌ సోకిన వ్యక్తి పరిస్థితి విషమించడంతో....

Updated : 01 May 2020 20:00 IST

దిల్లీ: ప్రస్తుత పరిస్థితుల్లో ప్లాస్మాథెరపీ ప్రయోగాలు నిలిపివేయడం కుదరదని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ క్రేజీవాల్ స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ రోగుల్లో ఇది ప్రభావంతంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. ఇటీవల వైరస్‌ సోకిన వ్యక్తి పరిస్థితి విషమించడంతో అతనికి ప్లాస్మాథెరపీ ద్వారా చికిత్స‌ అందిచామని... ప్రస్తుతం అతను పూర్తిగా కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయినట్లు కేజ్రీవాల్ ఆన్‌లైన్‌లో మీడియా సమావేశంలో వెల్లడించారు. దిల్లీ ప్రభుత్వం పరీక్షలు ఎక్కువగా నిర్వహించడం వల్లే ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. ‘‘మేము ప్లాస్మాథెరపీ ప్రయోగాలను నిలివేయం. ఈ థెరపీ ద్వారా మేము మంచి ఫలితాలను పొందుతున్నాం. ప్రస్తుతానికి ఇది ప్రయోగ దశలోనే ఉంది. అయితే థెరపీ ప్రయోగ ఫలితాలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే దీనికి పరిష్కారం కనుగొంటాం’’ అని కేజ్రీవాల్ తెలిపారు. 

కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్లాస్మాథెరపీ ప్రయోగించడానికి అనుమతి ఉన్నవారు మాత్రమే దాన్ని ఉపయోగించాలని ఆదేశించింది. అనుమతి లేకుండా ప్లాస్మాథెరపీ చికిత్స అందించడం చట్ట విరుద్ధం అని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కరోనా నుంచి కోలుకున్న 1,100 మంది తమ ప్లాస్మాను ఇతర రోగులకు చికిత్స అందించేందుకు సుముఖంగా ఉండటంపట్ల కేజ్రీవాల్‌ సంతోషం వ్యక్తం చేశారు. దిల్లీలో ప్రతి పది లక్షల మందికి 2,300 కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. రాజస్థాన్‌లోని కోటాలో చిక్కుకున్న విద్యార్థులను రాష్ట్రానికి తిరిగి తీసుకొచ్చేందుకు దిల్లీ ప్రభుత్వం 40 బస్సులను పంపించినట్లు తెలిపారు. 

ఇవీ చదవండి...

టి-కణాలు తగ్గితే కరోనా తీవ్రరూపం

కూలీల తరలింపునకు ప్రత్యేక రైళ్లు


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని