కార్మికులతో ముచ్చటించిన యోగి ఆదిత్యనాథ్‌

మేడేను పురస్కరించుకొని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌లో కొద్దిసేపు కార్మికులతో ముచ్చటించారు. లాక్‌డౌన్‌ కారణంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను..

Published : 01 May 2020 21:56 IST

రెండో విడత నగదు జమచేయనున్నట్లు వెల్లడి

లక్నో: మేడేను పురస్కరించుకొని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌లో కొద్దిసేపు కార్మికులతో ముచ్చటించారు. లాక్‌డౌన్‌ కారణంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతకుమందు జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. లాక్‌డౌన్ కారణంగా జీవనోపాధి దెబ్బతిన్న 30 లక్షల మంది కార్మికుల బ్యాంకు ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత రూ.1,000 జమ చేయనున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ 30న 27.15 లక్షల ఎంఎన్‌ఆర్‌ఈజీఏ కార్మికుల బ్యాంకు ఖాతాల్లో రూ.611 కోట్లు జమ చేసినట్లు తెలిపారు.

‘ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న యూపీకి చెందిన కార్మికులు వారి రేషన్కార్డు నంబరును ఉపయోగించుకొని ఉన్నచోటనే దాని ప్రయోజనాలు పొందవచ్చు. రేషన్ కార్డు లేని వారికి, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్) కింద ఆహార ప్యాకెట్లు అందిస్తోంది. దిల్లీ నుంచి దాదాపు 4 లక్షల మంది, హరియాణా నుంచి 12 వేల మంది వలసదారులు రాష్ట్రానికి క్షేమంగా తిరిగి వచ్చారు. కేంద్రం అనుమతి ఇవ్వడంతో ప్రత్యేక రైళ్ల ద్వారా ఆయా రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులు, పర్యాటకులు, విద్యార్థులను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని