
చైనాలో కొత్తగా 14 కరోనా పాజిటివ్ కేసులు
బీజింగ్: కరోనా పుట్టుకకు కేంద్రంగా భావిస్తున్న చైనాలో ఆదివారం కొత్తగా 14 కరోనా కేసులు నమోదయినట్లు అక్కడి ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. అయితే వీరిలో 12 మందికి వ్యాధి లక్షణాలు కనిపించకపోవడం ఆందోళన కలిస్తోందని పేర్కొన్నారు. మిగిలిన ఇద్దరిలో ఒకరు విదేశాల నుంచి రాగా, మరొకరికి స్థానికంగా వైరస్ సంక్రమించినట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ (ఎన్‌హెచ్‌సీ) వెల్లడించింది. దీంతో చైనాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 82,877కు చేరుకుంది. అలానే 4,633 మంది కరోనా బారినపడి మృతి చెందారు. ఇప్పటి వరకు 1,672 మంది కరోనా లక్షణాలతో విదేశాల నుంచి రాగా, వారిలో 451 మంది చైనాకు చెందిన వారని, వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎన్‌హెచ్‌సీ తెలిపింది. శనివారం కొత్తగా 12 మందికి వైరస్ సోకగా వారిలో ఎలాంటి లక్షణాలు లేవని.. మొత్తంగా ఇలాంటి కేసుల సంఖ్య 968 కాగా, వారిలో 98 మంది విదేశాల నుంచి వచ్చిన వారని తెలిపారు. ప్రస్తుతం వీరంతా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు వెల్లడించారు.
ఏప్రిల్ 26న హుబేయ్ ప్రావిన్స్‌లో కరోనా కేసులు లేవని ప్రకటించారు. అయితే శనివారం నాటికి అక్కడ 651 కేసులు నమోదుకాగా... వారిలో ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని తెలిపారు. కరోనా లక్షణాలు లేకుండా కేసులు నమోదవుతుండటం వైరస్ వ్యాప్తిపై ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ఇప్పటికే చైనా ప్రభుత్వం విదేశాల నుంచి ఎవ్వరూ రాకుండా ఆంక్షలు విధించింది. అంతర్జాతీయ విమానాల సంఖ్యను తగ్గించింది. చైనాలోని వుహాన్‌లో తొలి కరోనా కేసు నమోదు కాగా, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 34 లక్షల మందికి సోకింది. అలానే ఈ మహమ్మారి బారినపడి 2,43,829 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇవీ చదవండి...
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.