‘నామ్‌’ సదస్సులో ప్రధాని మోదీ!

ఈ రోజు జరుగనున్న అలీనోద్యమ(నామ్‌)సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొననున్నారు. ప్రపంచదేశాలకు సవాల్‌ విసురుతున్న కొవిడ్‌-19 వైరస్‌పై ప్రపంచదేశాల చర్చకు ఈ సదస్సు వేదిక కానుంది.

Updated : 04 May 2020 21:25 IST

దిల్లీ: ఈ రోజు జరుగనున్న అంతర్జాతీయ అలీనోద్యమ కూటమి(నామ్‌)సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొననున్నారు. ప్రపంచదేశాలకు సవాల్‌ విసురుతున్న కొవిడ్‌-19 వైరస్‌పై ప్రపంచదేశాల చర్చకు ఈ సదస్సు వేదిక కానుంది. అయితే ఈసారి వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా నిర్వహిస్తున్న ఈ సదస్సులో భారత ప్రధాని పాల్గొంటున్నారు. నేటి సాయంత్రం జరిగే ఈ సదస్సులో భారత ప్రధాని మోదీతోపాటు విదేశాంగమంత్రి ఎస్‌ జయశంకర్‌ కూడా పాల్గొంటారు. అయితే, భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారిగా ఈ సదస్సులో మోదీ పాల్గొంటుండడం విశేషం. ఇదివరకు 2016, 2019లో జరిగిన సదస్సుకు ప్రధాని మోదీ హాజరుకాలేదు. ఈ రెండుసార్లు భారత్‌ తరపున ఉపరాష్ట్రపతి ప్రాతినిథ్యం వహించారు. అంతేకాదు నామ్‌ సదస్సుకు హాజరుకాని తొలి భారత ప్రధానిగా మోదీ మిగిలిపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి తరువాత అత్యంత బలీయమైందిగా భావించే అలీనోద్యమ కూటమి(నామ్‌-నాన్‌ అలైన్‌డ్‌ మూమెంట్‌)1961లో ప్రారంభమైంది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికాకు చెందిన దాదాపు 120దేశాలు దీనిలో భాగస్వాములుగా ఉన్నాయి.

ఇవీ చదవండి..

అమెరికాలో ఉద్యోగులకు గడ్డు కాలమే!

భారత్‌లో కరోనా: 42వేల కేసులు, 1373 మరణాలు

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని