వారికి టిక్కెట్లు అమ్మడం లేదు: భారతీయ రైల్వే

వలస కూలీల నుంచి రైలు ప్రయాణ ఛార్జీలను వసూలు చేస్తున్నారని వస్తోన్న కథనాలపై భారతీయ రైల్వే స్పందించింది. వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాటు చేసిన రైళ్లలో ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదని రైల్వేశాఖ స్పష్టం చేసింది.

Updated : 04 May 2020 15:27 IST

దిల్లీ: వలస కూలీల నుంచి రైలు ప్రయాణ ఛార్జీలను వసూలు చేస్తున్నారని వస్తోన్న కథనాలపై భారతీయ రైల్వే స్పందించింది. వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాటు చేసిన రైళ్లలో ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదని రైల్వేశాఖ స్పష్టం చేసింది. వీరికోసం ప్రత్యేకంగా నడుపుతున్న శ్రామిక్‌ రైళ్లకోసం కేవలం ఆయా రాష్ట్రప్రభుత్వాల నుంచి మాత్రమే రుసుము వసూలు చేస్తున్నామని తెలిపింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించిన ప్రయాణికులను మాత్రమే ఈ రైళ్లలో అనుమతి ఇస్తున్నామని..ఇతర వ్యక్తులకు ఇందులో అనుమతి లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా వీటిలో ప్రయాణించే వారికి ఉచితంగా ఆహారాన్ని అందిస్తున్నామని తెలిపింది. లాక్‌డౌన్‌ కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వారిని తరలించేందుకు భారతీయ రైల్వే 34 శ్రామిక్‌ రైళ్లను నడుపుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ రైళ్లలో ప్రయాణించే వలస కార్మికుల ప్రయాణ ఛార్జీలను భరిస్తామని కాంగ్రెస్‌ పార్టీ అధినేత సోనియా గాంధీ ప్రకటించారు. వలస కార్మికుల నుంచి రైల్వేశాఖ ప్రయాణ ఛార్జీలను వసూలు చేస్తుందని పలువులు ఆరోపించిన నేపథ్యంలో రైల్వేశాఖ ఈ విధంగా స్పందించింది.

ఇవీ చదవండి..

వలస కూలీల రైలు ఛార్జీలు కాంగ్రెస్సే భరిస్తుంది!

భారత్‌లో 42వేల కేసులు, 1373మరణాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని