బీఎస్‌ఎఫ్ సిబ్బందికి కరోనా పాజిటివ్‌... 

పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తున్న కేంద్ర అంతర్‌ మంత్రిత్వశాఖ బృందంలోని సరిహద్దు భద్రత దళం కానిస్టేబుల్‌కు కరోనా సోకడంతో అతనితో సన్నిహితంగా ఉన్న 50 మంది భద్రతా సిబ్బందిని క్వారంటైన్‌ తరలించినట్లు ...

Updated : 04 May 2020 16:32 IST

50 మంది భద్రతా సిబ్బంది క్వారంటైన్‌కి తరలింపు 

దిల్లీ/కోలకతా: పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తున్న కేంద్ర అంతర్‌ మంత్రిత్వశాఖ బృందం (ఐఎంసీటీ)లోని సరిహద్దు భద్రత దళం (బీఎస్‌ఎఫ్) కానిస్టేబుల్‌కు కరోనా సోకడంతో అతనితో సన్నిహితంగా ఉన్న 50 మంది భద్రతా సిబ్బందిని క్వారంటైన్‌ తరలించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కరోనా నియంత్రణకు రాష్ట్రాలు చేపడుతున్న చర్యలను పర్యవేక్షించేందుకు ఐఎంసీటీ బృందాలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా సోకిన బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ ఐఎంసీటీ బృందంలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం అతనికి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని నిర్థారణ కావడంతో అతణ్ని రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఐసోలేషన్ కేంద్రానికి తరలించినట్లు తెలిపారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తున్న కేంద్రం బృందం సభ్యులు కోల్‌కతాలోని బీఎస్‌ఎఫ్ అతిధి గృహంలో ఉంటున్నారు. కానిస్టేబుల్‌తో సన్నిహితంగా ఉన్న  50 భద్రతా సిబ్బందిని కూడా క్వారంటైన్‌కు పంపినట్లు తెలిపారు. 

బీఎస్‌ఎఫ్ ప్రధాన కార్యాలయంలో కానిస్టేబుల్‌కు కరోనా 

దిల్లీలోని బీఎస్‌ఎఫ్ ప్రధాన కార్యాలయంలో పనిచేసే కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో  కార్యాలయంలో రెండు అంతస్తులను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు బీఎస్‌ఎఫ్ ప్రధాన కార్యాలయం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆదివారం బీఎస్‌ఎఫ్‌ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న కానిస్టేబుల్‌కు కరోనా వైరస్ సోకినట్లు నిర్థారణ అయింది. అతను చివరగా మే 1న విధులకు హాజరయినట్లు గుర్తించారు. దీంతో అతడు విధులు నిర్వహిస్తున్న మొదటి, రెండవ అంతస్తులను పూర్తిగా శానిటైజ్‌ చేసేవరకు ఎవ్వరిని అనుమతించేదిలేదని తెలిపారు. ఇప్పటి వరకు బీఎస్‌ఎఫ్‌లో పనిచేస్తున్న 42 మంది భద్రతా సిబ్బందికి కరోనా సోకిందని వెల్లడించారు. 

ఇవీ చదవండి...

కరోనా యోధులకు ‘త్రివిధ’ వందనం

ఈ పజిల్‌ను విప్పుతారా!: రాహుల్ గాంధీ  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని