కరోనా వ్యాక్సిన్ తయారీ అంత తేలిక కాదు!

కరోనా వ్యాక్సిన్ అభివృద్ధికి శాస్త్రవేత్తలకు రింత సమయం పట్టే అవకాశం ఉందని ప్రంపంచవ్యాప్తంగా ఉన్న పలువురు ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో హెచ్‌ఐవీ, డెంగ్యూ వ్యాధుల వ్యాక్సిన్‌ తయారీకి ఎక్కువ సమయం పట్టిందన్న విషయాన్ని.... 

Updated : 04 May 2020 22:57 IST

ఏడాదిన్నర సమయం పట్టొచ్చంటున్న ఆరోగ్య నిపుణులు

లండన్‌: కరోనా వ్యాక్సిన్ అభివృద్ధికి శాస్త్రవేత్తలకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో హెచ్‌ఐవీ, డెంగీ వ్యాధుల వ్యాక్సిన్‌ తయారీకి ఎక్కువ సమయం పట్టిందన్న విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 రకాల వ్యాక్సిన్స్‌లు ప్రయోగాల దశలో ఉన్నాయని, వాటిలో కొన్ని మనుషులపై ప్రయోగించే స్థాయికి చేరుకున్నాయని తెలిపారు.

‘‘ఇప్పటికీ కొన్ని వైరస్‌లకు వ్యాక్సిన్‌లు లేవు. అలానే కరోనాకు ఎప్పటికీ వ్యాక్సిన్‌ తయారవుతుందనే దానిపై స్థిర అభిప్రాయానికి రాలేం. అన్ని రకాల పరీక్షలు, భద్రత ప్రమాణాలు పూర్తిచేసుకున్న తర్వాత మాత్రమే వ్యాక్సిన్‌ మనకు అందుబాటులోకి వస్తుంది. అయితే వ్యాక్సిన్ తయారీ అనేది ఆలస్యంగా, బాధతో కూడిన ప్రక్రియ. ప్రస్తుతం మనం యాంత్రిక వ్యవస్థలతో కాకుండా జీవ వ్యవస్థలతో పోరాడుతున్నాం. ప్రయోగదశలో శరీర వ్యవస్థ ఎలా స్పందిస్తున్న దాని ఆధారంగా వ్యాక్సిన్‌ తయారీ ఆధారపడి ఉంటుంది’’ అని ఇంపీరియల్ కాలేజ్‌ ఆఫ్ లండన్‌లో అంతర్జాతీయ ఆరోగ్య విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ డేవిడ్ నబార్రో అన్నారు. ప్రస్తుతం నబార్రో కరోనా నియంత్రణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)తో కలిసి పనిచేస్తున్నారు. 

కరోనా నియంత్రణకు శాస్త్రవేత్తలు ఎబోలా డ్రగ్, ప్లాస్మా థెరపీ వంటి వివిధ చికిత్సలను ప్రయోగించినప్పటికీ, హైడ్రాక్సిక్లోరోక్విన్ మాత్రమే కొంతమేర పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిందని అన్నారు. వ్యాక్సిన్ తయారయ్యే వరకు వైరస్‌ను ఎదుర్కొనేందుకు మనల్ని మనం సిద్ధం చేసుకోవాలని నబార్రో సూచించారు. వ్యాక్సిన్‌ రావడానికి దాదాపు ఏడాదిన్నర సమయం పడుతుందని అమెరికా జాతీయ అలర్జీ, అంటువ్యాధుల సంస్థ (ఎన్‌ఐఏఐడీ) డైరెక్టర్‌ ఆంటోని ఫౌసి కూడా అభిప్రాయపడ్డారు. డబ్ల్యాహెచ్‌వో నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 102 కంపెనీలు వ్యాక్సిన్‌ తయారీ రేస్‌లో ఉండగా, వాటిలో కేవలం ఎనిమిది మాత్రమే మానవులపై ప్రయోగించే దశకు చేరుకున్నాయి.

ఇవీ చదవండి... 

బీఎస్‌ఎఫ్ సిబ్బందికి కరోనా పాజిటివ్‌... 

అందువల్లే వైరస్‌ తీవ్రత అధికం: కేంద్ర మంత్రి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని