ముగ్గురు సీఆర్పీఎఫ్ సిబ్బంది మృతి

జమ్మూ-కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాల్లో సోమవారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో ముగ్గురు సీఆర్పీఎఫ్‌ సిబ్బంది మృతి చెందారు. కుప్వారా జిల్లా హంద్వారా ప్రాంతంలో పెట్రోలింగ్ విధుల్లో ఉన్న సీఆర్పీఎఫ్‌ సిబ్బంది లక్ష్యంగా.... 

Published : 04 May 2020 20:36 IST

శ్రీనగర్‌: జమ్మూ-కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాల్లో సోమవారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో ముగ్గురు సీఆర్పీఎఫ్‌ సిబ్బంది మృతి చెందారు. కుప్వారా జిల్లా హంద్వారా ప్రాంతంలో పెట్రోలింగ్ విధుల్లో ఉన్న సీఆర్పీఎఫ్‌ సిబ్బంది లక్ష్యంగా ఉగ్రవాదులు తీవ్రస్థాయిలో కాల్పులకు తెగబడ్డారు.  ఈ ఘటనలో ముగ్గురు సిబ్బంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. వెంటనే అప్రమత్తమయిన సీఆర్పీఎఫ్ యూనిట్ ఎదురుకాల్పులు ప్రారంభించింది. దాడి ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పెద్ద ఎత్తున్న భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. శనివారం కుప్వారా జిల్లాలోని బాబాగండ్‌లోఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. వీరిలో ఒక కల్నల్, ఒక మేజర్‌, ఇద్దరు సైనికులు, జమ్మూ-కశ్మీర్‌ పోలీసు విభాగానికి చెందిన ఒక ఎస్సై వీరమరణం పొందారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని