సేల్స్‌మన్‌కు ₹20 కోట్ల లాటరీ!

పాధి కోసమని దుబాయ్‌ వెళ్లి సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్న భారతీయుడికి జాక్‌పాట్ తగిలింది. లాటరీలో ఏకంగా పది మిలియన్‌ దీరామ్స్‌ గెలుకొని కోటీశ్వరుడు అయిపోయాడు. కేరళలోని...

Published : 05 May 2020 00:48 IST

దుబాయ్‌: ఉపాధి కోసమని దుబాయ్‌ వెళ్లి సేల్స్‌మన్‌గా పనిచేస్తున్న భారతీయుడికి జాక్‌పాట్ తగిలింది. లాటరీలో ఏకంగా పది మిలియన్‌ దిర్హమ్స్‌ (సుమారు రూ.20 కోట్లు) గెలుచుకొని కోటీశ్వరుడు అయిపోయాడు. కేరళలోని త్రిశ్శూర్ చెందిన దిలీప్‌ కుమార్ ఎల్లికొట్టిల్ పరమేశ్వరన్‌ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని అజ్మాన్‌ నగరంలో ఓ ఆటోమొబైల్ సంస్థలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రతి నెలా మూడో తారీఖున బిగ్‌ టికెట్ డ్రా పేరుతో నిర్వహించే లాటరీ టికెట్‌ను 500 దిర్హమ్స్‌ (రూ.10 వేలు) పెట్టి కొనుగోలు చేశాడు. ఈ సారి తీసిన లాటరీ డ్రాలో దిలీప్‌ సుమారు రూ.20 కోట్లు గెలుచుకున్నట్లు స్థానిక వార్త సంస్థ తెలిపింది. గెలుచుకున్న మొత్తంలో కొంత సొమ్ముతో తనకున్న బ్యాంక్‌లోన్‌కు చెల్లించి, మిగిలిన సొమ్మును తన ఇద్దరు పిల్లల చదువుల కోసం వినియోగించనున్నట్లు దిలీప్‌ వెల్లడించాడు. ఆయన దాదాపు 17 సంవత్సరాల నుంచి అజ్మాన్ నగరంలో కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని