అవి వైరస్‌ కంటే ప్రమాదకరం: ప్రధాని మోదీ

ప్రపంచం మొత్తం కరోనా కట్టడికి పోరాడుతుంటే, కొంత మంది వ్యక్తులు మాత్రం దేశాలను, ప్రజలను విభజించేందుకు ఉగ్రవాదం, అసత్య వార్తలు, నకిలీ వీడియోలు వంటి అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లను వ్యాపింపజేసే పనిలో నిమగ్నమయ్యారని....

Updated : 04 May 2020 22:55 IST

దిల్లీ: ప్రపంచం మొత్తం కరోనా కట్టడికి పోరాడుతుంటే.. కొందరు మాత్రం దేశాలను, ప్రజలను విభజించేందుకు ఉగ్రవాదం, అసత్య వార్తలు, నకిలీ వీడియోలను వ్యాప్తిలోకి తెస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. అవి కరోనా కంటే ప్రమాదకరమైన వైరస్‌లుగా పోల్చారు. వాటిని వ్యాపింపజేసే పనిలో కొందరు నిమగ్నమయ్యారంటూ పరోక్షంగా పాకిస్థాన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ అలీనోద్యమ కూటమి (నామ్‌) సదస్సులో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

భారత్‌కు సొంత అవసరాలు ఉన్నప్పటికీ, ఇప్పటివరకు 123 భాగస్వామ్య దేశాలకు వైద్య ఉపకరణాలు పంపినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. వీటిలో 59 నామ్‌ దేశాలు ఉన్నాయని తెలిపారు. అంతర్జాతీయంగా వ్యాధుల నివారణ, వ్యాక్సిన్ తయారీలో భారత్ చురుగ్గా తనవంతు పాత్ర పోషిస్తోందని తెలిపారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు పొరుగున ఉన్న దేశాలతో సమన్వయం చేసుకుంటూ, వారికి భారతీయ వైద్య నిపుణులు ఆన్‌లైన్ ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు.

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని