భారత్‌లో ఒకేరోజు 195మరణాలు, 3,900కేసులు

భారత్‌లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3900 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా 195మరణాలు సంభవించాయి. దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య మంగళవారం ఉదయానికి 46,433కు చేరగా 1568మంది మృత్యువాతపడ్డట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖ వెల్లడించింది.

Updated : 05 May 2020 10:20 IST

దిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3900 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా 195మరణాలు సంభవించాయి. దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య మంగళవారం ఉదయానికి 46,433కు చేరగా 1568మంది మృత్యువాతపడ్డట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖ వెల్లడించింది. మొత్తం బాధితుల్లో 12,727మంది కోలుకోగా మరో 32,138 మంది చికిత్స పొందుతున్నారు. అయితే, భారత్‌లో కరోనా వైరస్‌ బయటపడ్డ అనంతరం అత్యధిక కేసులు, మరణాలు నమోదుకావడం ఇదే తొలిసారి.

పశ్చిమబెంగాల్‌లో ఒకేరోజు 98మంది మృత్యువాత..

పశ్చిమబెంగాల్‌లో కరోనా తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. కేవలం ఒక్కరోజులోనే రాష్ట్రంలో కరోనా వైరస్‌ సోకినవారిలో 98మంది మృత్యువాత పడ్డారు. కొత్తగా 296 కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో ఇప్పటివరకు ఈ వైరస్‌తో మరణించినవారి సంఖ్య 133కి చేరింది. రాష్ట్రంలో మొత్తం 1259కేసులు నిర్ధారణ కాగా 218 మంది కోలుకున్నారు. అయితే, కేంద్ర బృందం పశ్చిమబెంగాల్‌లో పర్యటించి వెళ్లిన మరునాడే మరణాల సంఖ్యలో భారీ పెరుగుదల నమోదైంది. దీంతో ఆరాష్ట్రంలో కేసులు, మరణాల సంఖ్య బహిరంగపరచడం లేదని వస్తోన్న అనుమానాలకు బలం చేకూరుతోంది. అంతేకాకుండా దేశంలో అత్యధిక మరణాలు రేటు ఇక్కడే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం పశ్చిమబెంగాల్‌లో కొవిడ్ మరణాల రేటు 12.8గా ఉంది.

మహారాష్ట్రలో ఒకేరోజు 1567, తమిళనాడులో 527 కేసులు..

కరోనా వైరస్‌ ధాటికి మహారాష్ట్ర ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ సంఖ్య భారీగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 1567కొత్త కేసులు, 35మరణాలు సంభవించాయంటే వైరస్‌ తీవ్రత ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 14,541కి చేరగా 583మంది మృత్యువాతపడ్డారు. వీటిలో ఎక్కువ కేసులు ముంబయి నగరంలోనే బయటపడ్డట్లు ప్రభుత్వం పేర్కొంది.

ఇక గుజరాత్‌లో ఒకేరోజు 376కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 5804కి చేరగా ఇప్పటివరకు 319మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ రాజధాని దిల్లోలోనూ ఒకేరోజు 349 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో దీల్లీలో ఈ వైరస్‌ బారినపడినవారి సంఖ్య 4898కి చేరగా 64మంది మరణించారు. తమిళనాడులోనూ వైరస్‌ తీవ్రత అనూహ్యంగా పెరిగింది. కేవలం నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 527 కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3550కి చేరగా 31మంది ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్‌లోనూ కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 2942 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా 165మంది మరణించారు.

ఆంధ్రప్రదేశ్‌లో 1650, తెలంగాణలో 1085..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ తీవ్రత రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో నిన్న ఒక్కరోజే 67పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 1650కి చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా బారినపడి 524మంది కోలుకున్నారు. ఇక తెలంగాణలో నిన్న కొత్తగా మూడు కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1085కి చేరగా 29మంది చనిపోయారు.

రాష్ట్రాల వారీగా వివరాలు..

ఇవీ చదవండి..

లాక్‌డౌన్‌ మరింత పొడిగింపు..

ఇండియా..ఇటలీ అవ్వాలని మీ కోరికా?

 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు