ప్రపంచ సంఘీభావానికి ఇదే నిదర్శనం

కరోనా వ్యాక్సిన్‌ తయారీకి అందిన బిలియన్ల కొద్దీ డాలర్ల విరాళం, ప్రపంచ దేశాల ఐక్యతకు గట్టి నిదర్శనమని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు టెడ్రోస్‌ అథనోమ్‌ తెలిపారు.

Published : 05 May 2020 12:45 IST

డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ 

జెనీవా: కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ తయారీకి అందిన బిలియన్ల‌ డాలర్ల విరాళం, ప్రపంచ దేశాల ఐక్యతకు గట్టి నిదర్శనమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ అథనోమ్‌ తెలిపారు. యూరోపియన్‌ కమిషన్‌ నిర్వహించిన వీడియో సమావేశంలో పాల్గొన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌.. ‘‘ప్రపంచ దేశాల మధ్య మంచి సంఘీభావం ఉందనేందుకు ఇది శక్తిమంతమైన, స్ఫూర్తినిచ్చే ఉదాహరణ. ప్రపంచానికి ఉమ్మడి శత్రువు అయిన కరోనాను ఎదుర్కొనేందుకు ఏకమవడానికి... ఐకమత్యంతో ప్రపంచ భవిష్యత్తును నిర్మించుకునేందుకు కూడా ప్రపంచ దేశాలకు ఇది ఓ మంచి అవకాశం.’’ అన్నారు. 

కొవిడ్‌-19 ను నిరోధించే వ్యాక్సిన్‌ తయారీ, పంపిణీల కోసం 7.4 బిలియన్‌ యూరోలు (సుమారు 8.1 బిలియన్‌ డాలర్లు) విరాళాల రూపంలో సమకూరినట్లు ఆయన ప్రకటించారు. అయితే, అంతర్జాతీయంగా రెండున్నర లక్షలకు పైగా మరణాలకు కారణమై, 35 లక్షలకు మందికి సోకిన కొవిడ్ మహమ్మరిని ఎదుర్కోవటానికి ఇది కొంతమేరకు మాత్రమే ఉపయోగపడగలదని ఆయన అన్నారు. రానున్న కాలంలో వ్యక్తిగత రక్షణ తొడుగులు, ఆక్సిజన్‌ తదితర అత్యవసర వైద్య పరికరాల కొనుగోలుకు మరింత ఆర్థిక సహకారం కావాలని ఆయన అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని