లాక్‌డౌన్‌ 3.0 తరవాత ఏంటి?: సోనియా

ఏ ప్రమాణాల ఆధారంగా ఇంకెంతకాలం లాక్‌డౌన్‌ను కొనసాగిస్తారో తెలుసుకోవాలనుకుంటున్నామని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ కేంద్రాన్ని ప్రశ్నించారు.

Updated : 06 May 2020 17:17 IST

దిల్లీ: ఇంకెంతకాలం లాక్‌డౌన్‌ను కొనసాగిస్తారో చెప్పాలని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ కేంద్రాన్ని ప్రశ్నించారు. బుధవారం ఆమె కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమై కరోనా వైరస్‌ సంక్షోభంపై చర్చించారు.

‘మే 17 తరవాత ఏంటి? మే 17 తర్వాత ఎలా? ఏ ప్రమాణాల ఆధారంగా కేంద్రం ఇంకెంత కాలం లాక్‌డౌన్‌ను పొడిగిస్తుంది’ అని సోనియా గాంధీ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇదే సమావేశంలో పాల్గొన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్..‘లాక్‌డౌన్‌ 3.0 తరవాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నాం’ అని అన్నారు. కరోనా వైరస్‌ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, వలస కూలీల సమస్యలు, వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని వెనక్కి తీసుకురావడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆమె పార్టీ నేతలతో చర్చించారు. ఈ సమావేశంలో ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. వలస కార్మికుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని సోనియా, రాహుల్ కొద్ది రోజులుగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని