టూరిజమే ఆధారం..బతుకుచక్రం ముందుకెలా?

కరోనా ప్రభావంతో లాక్‌డౌన్‌ కొనసాగుతున్న వేళ దేశంలో పర్యాటక రంగం కుదేలైంది. ప్రముఖ పర్యాటక కేంద్రమైన గోవాలో పర్యాటకులు లేక ట్యాక్సీ డ్రైవర్లు .....

Published : 06 May 2020 15:33 IST

పర్యాటకం మూతపడటంతో గోవాలో ట్యాక్సీ డ్రైవర్ల ఆవేదన

పనాజీ: కరోనా ప్రభావంతో లాక్‌డౌన్‌ కొనసాగుతున్న వేళ దేశంలో పర్యాటక రంగం తీవ్రంగా నష్టపోయింది. ప్రముఖ పర్యాటక కేంద్రమైన గోవాలో పర్యాటకులు లేక ట్యాక్సీ ఆపరేటర్లు, డ్రైవర్లు ఉపాధి కోల్పోయారు. అక్కడ ప్రభుత్వం ట్యాక్సీలపై ఆంక్షలు సడలించినప్పటికీ పర్యాటక కార్యకలాపాలపై నిషేధాజ్ఞలు కొనసాగిస్తుండటంతో తమకెలాంటి ప్రయోజనమూ లేదంటూ అక్కడి ట్యాక్సీ డ్రైవర్లు వాపోతున్నారు.  తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అక్కడి పరిస్థితిపై ఉత్తర కోస్తా టూరిస్టు టాక్సీ అసోసియేషన్‌ అధ్యక్షుడు వాసుదేవ్‌ అర్లేకర్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వం టాక్సీలు నడిపేందుకు అనుమతులు ఇచ్చినా పర్యాటకులు లేకపోవడంతో వ్యాపారం జరగడంలేదు. రాష్ట్రంలో 15లక్షల జనాభా ఉంటే 16లక్షల కార్లు ఉన్నాయి. దీంతో మేం పర్యాటకులపైనే ఆధారపడి జీవించాల్సిన పరిస్థితి. పర్యాటక కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కానంతవరకు మా ‘బండి’ ముందుకు సాగదు’’ అన్నారు.

ఆర్నెళ్ల పాటు ఒక్కొక్కరికి రూ.12వేలు ఇవ్వండి!

మరోవైపు, ఈ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ మాట్లాడుతూ..  సీఎం ప్రమోద్‌ సావంత్‌ను కలిసి తమ డిమాండ్లను ఆయన ముందు ఉంచినట్టు తెలిపారు. ప్రతి ట్యాక్సీ డ్రైవర్‌కు నెలకు రూ.12వేలు చొప్పున ఆరు నెలల పాటు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరినట్టు చెప్పారు. ట్యాక్సీ నడిపేవాళ్లు బ్యాంకు వాయిదాలను సైతం కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారనీ.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని కోరారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని