548 వైద్యులు, నర్సులు, పారామెడిక్స్‌కు కరోనా

కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 548 వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బందికి కరోనా వైరస్‌ సోకింది. వీరికి వైరస్‌ ఎలా సోకిందో ఇంకా తెలియదని అధికారులు అంటున్నారు. వీరంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న ఆస్పత్రి సిబ్బందే కావడం గమనార్హం.....

Updated : 06 May 2020 19:08 IST

ముంబయి: కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 548 వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బందికి కరోనా వైరస్‌ సోకింది. వీరికి వైరస్‌ ఎలా సోకిందో ఇంకా తెలియలేదని అధికారులు అంటున్నారు. వీరంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న ఆస్పత్రి సిబ్బందే కావడం గమనార్హం.

ఆస్పత్రుల్లో పనిచేసే క్షేత్రస్థాయి సిబ్బంది, వార్డు బాయ్స్‌, పారిశుద్ధ్య కార్మికులు, భద్రతా సిబ్బంది, ప్రయోగశాల సహాయకులు, ఫ్యూన్లు, వస్త్రాలు శుభ్రం చేసేవారు, వంటచేసే సిబ్బంది ఈ లెక్కల్లో లేరని అధికారులు వెల్లడించారు. దిల్లీలోనే ఎక్కువ మంది వైద్యసిబ్బందికి కొవిడ్‌-19 సోకింది.

‘ఎవరి వల ఎలా, ఎవరి ద్వారా సోకిందో ఇంకా దర్యాప్తు చేయలేదు. అంటే ఆస్పత్రుల్లో సోకిందా బయట సోకిందా తెలియదన్నమాట. దిల్లీలోనే 69 మంది వైద్యులకు కొవిడ్‌-19 సోకింది. వీరే కాకుండా 274 మంది నర్సులు, పారామెడికల్‌ సిబ్బందీ ఈ జాబితాలో ఉన్నారు’ అని అధికారులు వెల్లడించారు.

సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో ఏడుగురు రెసిడెంట్‌ డాక్టర్లు, ఒక ప్రొఫెసర్‌ సహా 13 మందికి కొవిడ్‌-19 సోకింది. ఎయిమ్స్‌లో 10 మంది వైద్యసిబ్బందికి కరోనా వచ్చింది. వీరే కాకుండా దిల్లీలోని చాలా ఆస్పత్రుల్లో బాధితులు ఉన్నారు. కాగా దేశవ్యాప్తంగా 49,391 మందికి వైరస్‌ సోకగా 1,694 మంది మృతిచెందారు.

ఇవీ చదవండి

ఆ వీరపత్ని కన్నీటికి అర్థమేంటి?

హిజ్బుల్‌ టాప్‌ కమాండర్ హతం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని