చైనాను పొగిడిన కిమ్‌ 

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో చైనా విజయం సాధించిందని ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ప్రకటించారు. ఈ మహమ్మారిని నియంత్రించిన తీరు అభినందనీయమంటూ చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌కు తాజాగా కిమ్‌ ఓ సందేశాన్ని పంపారు.

Updated : 08 May 2020 11:12 IST

సియోల్‌: కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో చైనా విజయం సాధించిందని ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పొగడ్తలతో ముంచెత్తారు. కరోనాపై జరిగిన పోరులో చైనా విజయం సాధించిందని..దీన్ని నియంత్రించిన తీరు అభినందనీయమంటూ చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌కు తాజాగా కిమ్‌ ఓ సందేశాన్ని పంపారు. అంతేకాకుండా జిన్‌పింగ్‌ ఆరోగ్యంగా ఉండాలని కిమ్‌ ఆకాంక్షిస్తున్నట్లు ఉత్తర కొరియా అధికారిక మీడియా కేసీఎన్‌ఏ వెల్లడించింది. 20రోజులపాటు అజ్ఞాతంలోకి వెళ్లిన వచ్చిన అనంతరం కిమ్‌ చైనాను కీర్తిస్తూ ఈ సందేశాన్ని పంపడం గమనార్హం.

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రస్తుతం ప్రపంచదేశాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2లక్షల 68వేల మందిని పొట్టనపెట్టుకుంది. మరో 38లక్షల మంది దీనికి బాధితులుగా మారారు. చైనాతో అతి ముఖ్యమైన వ్యాపార భాగస్వామిగా ఉన్న ఉత్తర కొరియాలో ఒక్కపాజిటివ్‌ కేసు కూడా నమోదు కాకపోవడం ప్రపంచదేశాలను అశ్చర్యంతో పాటు అనుమానాలకు గురిచేస్తోంది. చైనాలో తొలుత విజృంభించిన ఈ వైరస్‌తో 82,800మంది బాధితులుగా మారగా..4633మంది మృత్యువాతపడ్డారు.

ఇవీ చదవండి..

ఉత్తర కొరియా అధినేత కిమ్‌ ప్రత్యక్షం..!

కొవిడ్‌కు కోరలు తొడిగిందెవరు?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని