గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీకి అనుమతి

కరోనా వైరస్‌ చికిత్సలో భాగంగా దేశ వ్యాప్తంగా 21 ఆస్పత్రుల్లో ప్లాస్మా థెరపీకి కేంద్రం అనుమతిచ్చింది. తెలంగాణలోని గాంధీ ఆస్పత్రికి అవకాశమిచ్చింది. ఈ థెరపీలో కరోనా సోకి నయమైన వ్యక్తి రక్తాన్ని సేకరించిన..

Published : 08 May 2020 23:08 IST

దిల్లీ: కరోనా వైరస్‌ చికిత్సలో భాగంగా దేశ వ్యాప్తంగా 21 ఆస్పత్రుల్లో ప్లాస్మా థెరపీకి కేంద్రం అనుమతిచ్చింది. తెలంగాణలోని గాంధీ ఆస్పత్రికి అవకాశమిచ్చింది. ఈ థెరపీలో కరోనా సోకి నయమైన వ్యక్తి రక్తాన్ని సేకరించిన అనంతరం దాని నుంచి ప్లాస్మాను వేరుచేస్తారు. ఇలా వేరుచేసిన ప్లాస్మాను అత్యవసర చికిత్స పొందుతున్న కరోనా బాధితునికి ఎక్కిస్తారు. కోలుకున్న వ్యక్తిలో కరోనా వైరస్‌పై పోరాడే శక్తి కలిగిన యాంటీబాడీస్‌ ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇలాంటి వ్యక్తినుంచి సేకరించిన ప్లాస్మాను కరోనా బాధితుడికి ఎక్కించడం ద్వారా అతడి శరీరంలోని యాంటీబాడీస్‌ వృద్ధిచెంది వైరస్‌పై పోరాడటంలో దోహదపడతాయి. దీంతో అతడు ఈ వైరస్‌ బారినుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని