అందువల్లే బెంగాల్‌లో కరోనా మరణాల రేటు అధికం!

పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం కరోనా కేసులను దాస్తోందంటూ కేంద్రంతో పాటు అక్కడి ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో వైద్య నిపుణులు ఆసక్తికరమైన విషయాలను

Published : 09 May 2020 01:28 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం కరోనా కేసులను దాస్తోందంటూ కేంద్రంతో పాటు అక్కడి ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో వైద్య నిపుణులు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆ రాష్ట్రంలో కొవిడ్‌-19 కేసులు పరిమితంగా నమోదవడానికి..పరీక్షల సంఖ్య తక్కువగా ఉండటంతో పాటు ప్రజల్లో నెలకొన్న అపోహలూ కారణమని వారు పేర్కొంటున్నారు.
‘ప్రజలు కరోనా వ్యాధిగ్రస్తులను వెలివేసినట్లుగా చూడటం, ఆ వ్యాధి బారిన పడటాన్ని అవమానకరంగా భావించడం, దాంతో పరీక్షలకు ఆస్పత్రికి వెళ్లడం కన్నా ఇంట్లోనే ఉండటం మేలని భావిస్తుండటం వంటివీ కారణం కావొచ్చు’ అని ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రికి చెందిన ప్రొఫెసర్‌ దీప్తేంద్ర సర్కార్‌ అభిప్రాయపడ్డారు. గురువారం నాటికి అక్కడ మొత్తం 1548 మంది కరోనా బారిన పడగా, 151 మంది మరణించారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా ఆ రాష్ట్రంలో కొవిడ్‌ మరణాల శాతం 13.2గా నమోదవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. మిగతా రాష్ట్రాల్లో అది 2 నుంచి 3 శాతానికే పరిమితమైంది. ఆ రాష్ట్రంలోని మొత్తం 23 జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాలు అత్యధికంగా ఉండే 7 జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదు. 80 శాతం కేసులు రెడ్‌ జోన్‌గా ప్రకటించిన నాలుగు జిల్లాల్లోనే వెలుగుచూశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు