ముందుగానే ట్వీట్‌ను సిద్ధం చేసుకోవచ్చు

వినియోగదారులు నిర్ణీత సమయానికి ట్వీట్‌ చేసే సౌకర్యాన్ని ట్విటర్‌ సంస్థ అందుబాటులోకి తెస్తోంది. కొత్త సౌకర్యం అందుబాటులోకి వస్తే ఐవోఎస్‌, ఆండ్రాయిడ్‌ వినియోగదారులు...

Published : 10 May 2020 23:44 IST

కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తున్న ట్విటర్‌

శాన్‌ఫ్రాన్సిస్కో: వినియోగదారులు నిర్ణీత సమయానికి ట్వీట్‌ చేసే సౌకర్యాన్ని ట్విటర్‌ సంస్థ అందుబాటులోకి తెస్తోంది. కొత్త సౌకర్యం అందుబాటులోకి వస్తే ఐవోఎస్‌, ఆండ్రాయిడ్‌ వినియోగదారులు తాము కోరుకున్న తేదీన, కోరుకున్న సమయానికి చేయాల్సిన ట్వీట్‌ని ముందుగానే షెడ్యూలింగ్‌ విండో ద్వారా సిద్ధం చేసుకోవచ్చు. అనంతరం ఆ సమయం రాగానే ట్వీట్‌ విడుదల చేస్తుంది. దీంతో వినియోగదారులు కోరుకున్న సమయానికి ట్వీట్‌ చేయగలుగుతారు. ప్రస్తుతం ట్విటర్‌ డెస్క్‌టాప్‌ వినియోగదారుల్లో కొందరికి మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సౌకర్యం త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని