రైలెక్కాలంటే ప్రయాణికులకు ఇవి తప్పనిసరి!

కరోనా విజృంభణతో దేశంలో లాక్‌డౌన్‌ -3 కొనసాగుతున్న వేళ  రైళ్లను క్రమంగా పునరుద్ధరించేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. ఇందులో భాగంగా  రేపట్నుంచి 15 జతల రైళ్లను (అప్‌ అండ్‌ డౌన్‌ కలిపి 30 రైళ్లు) ప్రారంభించాలని.......

Updated : 22 Nov 2022 14:07 IST

కేంద్ర  హోంశాఖ మార్గదర్శకాలు జారీ

దిల్లీ: కరోనా విజృంభణతో దేశంలో లాక్‌డౌన్‌ -3 కొనసాగుతున్న వేళ  రైళ్లను క్రమంగా పునరుద్ధరించేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. ఇందులో భాగంగా  రేపట్నుంచి 15 జతల రైళ్లను (అప్‌ అండ్‌ డౌన్‌ కలిపి 30 రైళ్లు) ప్రారంభించాలని నిర్ణయించినట్టు  ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రత్యేక రైళ్లలో ప్రయాణికులు పాటించాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ సోమవారం మధ్యాహ్నం విడుదల చేసింది. ఈ రోజు సాయంత్రం నుంచి ఐఆర్‌సీటీసీలో టిక్కెట్ల బుకింగ్‌కు అనుమతించిన కేంద్రం.. ఈ-టిక్కెట్లు కన్‌ఫర్మ్‌ అయిన వారిని మాత్రమే రైల్వేస్టేషన్లలోకి అనుమతిస్తామని స్పష్టం చేసింది. అందరూ తప్పనిసరిగా స్క్రీనింగ్‌  చేయించుకోవాలని తెలిపింది.  రైలు షెడ్యూల్, ప్రయాణికుల బుకింగ్, ప్రవేశం, ప్రయాణికుల కదలికలు, కోచ్ సేవల వివరాలను రైల్వే మంత్రిత్వ శాఖే విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించింది.  ఈ-టికెట్ ఆధారంగానే ప్రయాణీకుల కదలికలతో పాటు రైల్వే స్టేషన్‌కు ప్రయాణీకులను రవాణా చేసే వాహనం డ్రైవర్‌కు అనుమతి ఉంటుందని తెలిపింది. 

కరోనా లక్షణాలు లేని ప్రయాణికులను మాత్రమే రైళ్లలో ప్రయాణానికి అనుమతిస్తామని స్పష్టంచేసింది. ప్రయాణికుల కోసం స్టేషన్‌, కోచ్‌ ప్రవేశ, నిష్క్రమణ పాయింట్ల వద్ద హ్యాండ్‌ శానిటైజర్లు పెట్టాలని సూచించింది. ప్రయాణం సమయంలో అందరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించాల్సిందేనని సూచించింది. బోర్డింగ్‌, కోచ్‌లలో ప్రయాణిస్తున్న సమయంలో భౌతికదూరం పాటించాలని ప్రయాణికులకు సూచించింది.  ప్రయాణికుల కోసం ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ ప్రచారం ద్వారా ఆరోగ్య సలహాలు, మార్గదర్శకాలు అందించాలంది. ప్రయాణికులు తమ గమ్య స్థానాలకు చేరుకున్నాక ఆ రాష్ట్రం సూచించిన ఆరోగ్య నియమాలకు కట్టుబడి ఉండాల్సిందేనని హోంశాఖ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని