పోలీసులే వచ్చి ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తారు

పోలీసులే ఫిర్యాదు చేసిన వ్యక్తి ఇంటికెళ్లి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకొనేలా మధ్యప్రదేశ్ ప్రభుత్వం సోమవారం కొత్త వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. 

Published : 11 May 2020 18:01 IST

భోపాల్: పోలీసులే ఫిర్యాదు చేసిన వ్యక్తి ఇంటికెళ్లి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకొనేలా మధ్యప్రదేశ్ ప్రభుత్వం సోమవారం కొత్త వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. భోపాల్‌తో సహా 23 పోలీసు స్టేషన్లలో పైలట్‌ ప్రాజెక్టు కింద ఈ విధానాన్ని తీసుకువచ్చింది. ఆ రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా దీనిపై మాట్లాడుతూ.. మూడు నెలల పాటు ఈ విధానాన్ని అమలు చేస్తామని, ఇది కనుక విజయవంతమైతే రాష్ట్రం మొత్తం అమలు చేస్తామని వెల్లడించారు. దీని కింద ఫిర్యాదుదారు పోలీసు హెల్ప్‌లైన్‌ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. ఫస్ట్ రెస్పాన్స్‌ వెహికిల్(డయల్ 100) సంబంధిత ప్రాంతానికి వెళ్లి ఎఫ్ఐఆర్‌ను నమోదు చేస్తుంది.  ప్రస్తుతానికి వాహనాల దొంగతనం, ఘర్షణలు వంటి కొన్ని చిన్న కేసులను మాత్రమే నమోదు చేయనున్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో సామాన్యులు పోలీసు స్టేషన్‌కు వచ్చి కేసు నమోదు చేయడం కష్టమవుతోందని, అందుకే ఈ విధానాన్ని తీసుకువచ్చామని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ ప్రయోగం విజయవంతమైతే మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని