అలాంటి చోట్లే సమస్యలు పెరిగాయ్‌: మోదీ

కరోనా కట్టడి, లాక్‌డౌన్‌పై భవిష్యత్తు కార్యాచరణ, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ సీఎంలతో మరోసారి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ముందుకు సాగాల్సిన తీరు, ఎదుర్కొంటున్న సవాళ్లుకు సంబంధించి

Published : 11 May 2020 20:24 IST

దిల్లీ: కరోనా కట్టడి, లాక్‌డౌన్‌పై భవిష్యత్తు కార్యాచరణ, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ సీఎంలతో మరోసారి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ముందుకు సాగాల్సిన తీరు, ఎదుర్కొంటున్న సవాళ్లుకు సంబంధించి సమతుల వ్యూహం రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రులు ఇచ్చిన సూచనల ఆధారంగానే దేశం ఏ దిశలో వెళ్లాలో తాము నిర్ణయించగలుగుతామన్నారు. కరోనా నుంచి భారత్‌ తనను తాను విజయవంతంగా రక్షించుకుందని యావత్‌ ప్రపంచం భావిస్తోందని చెప్పారు. ఈ అంశంలో రాష్ట్రాలే కీలక పాత్ర పోషించాయన్నారు. ఎక్కడైతే భౌతికదూరం, నియమాలు పాటించలేదో అలాంటి చోట్లే మనకు సమస్యలు పెరిగాయని అన్నారు. లాక్‌డౌన్‌ నుంచి గ్రామీణ ప్రాంతాలకు మినహాయింపు ఇచ్చినా కరోనా అక్కడ వ్యాపించకుండా చూడటం మనముందున్న అతిపెద్ద సవాల్‌ అని సీఎంలతో ప్రధాని వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని