శీర్షిక పెట్టి..పేజీ ఖాళీగా ఉంచారు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించబోయే ఆర్థిక ప్యాకేజీ వివరాలు తెలుసుకోడానికి తాను ఎదురుచూస్తున్నాని కాంగ్రెస్‌ సీనియర్ నేత చిదంబరం వ్యాఖ్యానించారు.

Updated : 13 May 2020 15:26 IST

ప్యాకేజీ వివరాల కోసం ఎదురుచూస్తున్నాను: చిదంబరం

దిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించబోయే ఆర్థిక ప్యాకేజీ వివరాలు తెలుసుకోవడానికి తాను ఎదురుచూస్తున్నాని కాంగ్రెస్‌ సీనియర్ నేత పి.చిదంబరం వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారి దెబ్బకు కుదేలైన ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం పోసేందుకు మంగళవారం కేంద్రం రూ.20లక్షల కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై చిదంబరం ట్విటర్ వేదికగా స్పందించారు.

‘నిన్న ప్రధాని శీర్షిక పెట్టి, పేజీని ఖాళీగా వదిలేశారు. అందుకే నా నుంచి వచ్చిన స్పందన కూడా ఖాళీగానే ఉంది! ఈ రోజు ఆ పేజీని నింపే ఆర్థిక మంత్రి కోసం మేం ఎదురు చూస్తున్నాం. ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలోకి చొప్పించే ప్రతి అదనపు రూపాయిని మేం జాగ్రత్తగా లెక్కిస్తాం. ఎవరు ఏం పొందుతారో మేం పరిశీలిస్తాం. ఆకలి, పేదరికం, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని వందల కిలోమీటర్లు ప్రయాణించిన వలస కార్మికులు ఆశించేదేమిటో మేం చూడాలనుకుంటున్నాం’ అని ఈ మాజీ ఆర్థిక మంత్రి ట్వీట్ చేశారు.

రెండు రోజుల క్రితం ప్రయాణికుల సౌకర్యార్థం పరిమిత స్థాయిలో రైళ్లు నడపాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించిన సంగతి తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని