వందే భారత్ రెండో విడతలో 30 వేల మంది

లాక్‌డౌన్‌ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు చేపట్టిన వందే భారత్‌ మిషన్‌ రెండో విడతలో భాగంగా 30 వేల మందిని తీసుకురానున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరీ తెలిపారు. ఈనెల 16 నుంచి 22 మధ్య అమెరికా, ఫ్రాన్స్‌, రష్యా, జర్మనీ, ఇటలీ సహా 31 దేశాల......

Published : 13 May 2020 18:10 IST

దిల్లీ : లాక్‌డౌన్‌ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు చేపట్టిన వందే భారత్‌ మిషన్‌ రెండో విడతలో భాగంగా 30 వేల మందిని తీసుకురానున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరీ తెలిపారు. ఈనెల 16 నుంచి 22 మధ్య అమెరికా, ఫ్రాన్స్‌, రష్యా, జర్మనీ, ఇటలీ సహా 31 దేశాల నుంచి 149 విమానాల్లో భారతీయులను తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. వందే భారత్ మిషన్‌ మొదటి విడతలో భాగంగా 14,800మంది భారత్‌కు రావాల్సి ఉండగా ఇప్పటికే 8,500 మంది చేరుకున్నారని తెలిపారు. త్వరలోనే మిగిలిన వారు వస్తారని తెలిపారు. 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని