అప్పుడే మన గొంతు వినిపించగలం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ ప్రశంసలు కురిపించారు.

Published : 14 May 2020 21:47 IST

ఆర్థిక ప్యాకేజీని ప్రశంసించిన విదేశాంగ మంత్రి

దిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ ప్రశంసలు కురిపించారు. ఆమె ప్రకటనలు ‘సాహసోపేతమైన నిర్ణయాలు’ అంటూ అభివర్ణించారు. అలాగే విదేశాంగ విధానం ఇంటి నుంచే ప్రారంభం కావాలంటూ గురువారం ట్విటర్ వేదికగా స్పందించారు.

‘విదేశాంగ విధానం ఇంటి నుంచే ప్రారంభం అవుతుంది. పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ ఉంటే ప్రపంచ వేదికల మీద మన గొంతును బలంగా వినిపించడానికి ఉపయోగపడుతుంది. ఎంఎస్‌ఎంఈ రంగం పునరుజ్జీవనానికి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆర్థిక మంత్రి ప్రకటించిన ప్యాకేజీకి నా అభినందనలు. ఆ రంగం ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిది. ఎన్నడూ దాన్ని బలహీనపడనీయకూడదు. కొత్త విజన్, గట్టి ప్రయోజనం, లోతైన నిబద్ధతతో ప్రస్తుతం భారత్ ముందుకు వెళ్తోంది. స్వావలంబనతో కూడిన భారత్ ప్రపంచానికి మరింత ప్రయోజనాలను అందిస్తుంది’ అని వరస ట్వీట్లు చేశారు. కరోనా మహమ్మారితో ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న ఎంఎస్‌ఎంఈ రంగం కోలుకొనేలా సీతారామన్ కొన్ని ప్రకటనలు చేశారు. ఆ రంగంలో పనిచేస్తున్న కార్మికుల ఉద్యోగాలు పరిరక్షించడంపైనే ప్రధానంగా దృష్టి సారించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని