Updated : 14 May 2020 15:22 IST

ఆఫ్గన్‌లో పేలుడు... ఐదుగురి మృతి

కాబూల్‌:  ఆఫ్గనిస్థాన్‌ తూర్పు ప్రాంతంలోని గార్దెజ్‌ పట్టణంలో ఈ రోజు జరిగిన బాంబు పేలుడులో ఐదుగురు మరణించగా, 14 మంది గాయపడ్డారు. జనసాంద్రత అధికంగా ఉండే ఓ మిలిటరీ కోర్టు సమీపంలో పేలుడు పదార్ధాలతో నిండిన ఓ ట్రక్కును దుండగులు పేల్చివేశారు. కాగా ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా ఎక్కువ కావచ్చని అధికారిక ప్రతినిధి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ ఈ ఘటనకు ఎవరూ బాధ్యత వహించలేదు.

మంగళవారం కాబూల్‌లో  ఓ  ఆసుపత్రిలో జరిగిన కాల్పుల ఘటనలో మహిళలు, నవజాత శిశువులతో సహా 24 మంది మరణించారు. మరో వైపు ఐఎస్‌ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 32 మంది మృతిచెందారు. కాగా, ఈ దాడులను  అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ తీవ్రంగా ఖండించారు. రక్షణాత్మక వైఖరికి బదులుగా ఎదురు దాడి వ్యూహాన్ని అవలంబించాల్సిందిగా ఆయన ఆ దేశ భద్రతా బలగాలకు ఆదేశాలు జారీచేశారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని