120 దేశాలకు పారాసిటమాల్‌, హైడ్రాక్సీక్లోరోక్విన్‌

 కొవిడ్‌-19పై యావత్‌ ప్రపంచం పోరాడుతున్న వేళ గడిచిన 2 నెలల్లో 120 దేశాలకు భారత్‌ పారాసిటమాల్‌, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలను సరఫరా చేసిందని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. దేశీయ......

Published : 14 May 2020 20:40 IST

దిల్లీ: కొవిడ్‌-19పై యావత్‌ ప్రపంచం పోరాడుతున్న వేళ గడిచిన 2 నెలల్లో 120 దేశాలకు భారత్‌ పారాసిటమాల్‌, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలను సరఫరా చేసిందని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. దేశీయ అవసరాలకు సరిపడా మాత్రలు నిల్వ ఉంచుకున్నాకే వాటిని సరఫరా చేశామని తెలిపారు. ధనిక, శక్తిమంతమైన దేశాలు మాత్రమే కాక, వెనుకబడిన దేశాలు సైతం ఈ మాత్రలను పొందాలన్న ఉద్దేశంతోనే వీటి ఎగుమతులపై ఆంక్షలు విధించినట్లు ఓ వెబినార్‌లో వెల్లడించారు.

సరఫరా చేసిన దేశాల్లో సుమారు 40కి పైగా దేశాలు ఉచితంగా/ గ్రాంట్‌ రూపంలో వీటిని పొందాయని గోయల్‌ తెలిపారు. అలాగే ఇటీవల ప్రధాని పిలుపునిచ్చిన స్వావలంబ భారత్‌ నినాదం గురించి ప్రస్తావిస్తూ.. ప్రపంచ దేశాలతో కలిసి పనిచేస్తూనే వారిపై పూర్తిగా ఆధారపడకుండా దేశీయంగా నాణ్యమైన ఉత్పత్తులను, పోటీధరలకే విక్రయించడం ఆ నినాదం వెనుక ముఖ్య ఉద్దేశమని గోయల్‌ వివరించారు. ఇది కొందరికి అర్థం కాదని ఎద్దేవాచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని