నవాజ్‌ షరీఫ్‌పై మరో రెండు అవినీతి కేసులు

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌పై మరో రెండు అవినీతి కేసులు దాఖలు చేయడానికి పాక్‌ అవినీతి నిరోధక శాఖ ఆమోదం తెలిపింది. నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (నాబ్) ప్రాంతీయ బోర్డు...

Published : 16 May 2020 13:54 IST

ఆమోదం తెలిపిన అవినీతి నిరోధక శాఖ

లాహోర్‌: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌పై మరో రెండు అవినీతి కేసులు దాఖలు చేయడానికి పాక్‌ అవినీతి నిరోధక శాఖ ఆమోదం తెలిపింది. నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (నాబ్) ప్రాంతీయ బోర్డు.. డైరెక్టర్ జనరల్ షాజాద్ సలీం అధ్యక్షతన శుక్రవారం సమావేశమైంది. ఈ సందర్భంగా నవాజ్ షరీఫ్‌తో పాటు ఆయన తమ్ముడు షాబాజ్ షరీఫ్, కుమార్తె మారియం నవాజ్‌, మరో 13 మందికి సంబంధించిన మనీలాండరింగ్, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులను చర్చించింది. అలాగే 54 కెనాల్‌ భూవివాద కేసులోనూ నవాజ్‌ పేరును చేర్చాలని  బోర్డు నిర్ణయించింది. ఇందులో జియో మీడియా గ్రూప్ వ్యవస్థాపకుడు మీర్ షకీలూర్ రెహ్మాన్‌తో పాటు మరో ఇద్దరిని జత చేయాలని బోర్డు నిర్ణయించింది. ఈ రెండు కేసులను కోర్టులో ప్రవేశపెట్టడానికి ముందు నాబ్‌ బోర్డు.. ఛైర్మన్‌ జస్టిస్‌(రిటైర్డ్‌) జావెద్‌ ఇక్బాల్‌ దృష్టికి తీసుకెళ్లింది. 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని