ఆపరేషన్‌ సముద్ర సేతు: కొచ్చికి ఐఎన్‌ఎస్‌ జలాశ్వ!

విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను సముద్రమార్గం ద్వారా స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత నౌకాదళం ‘ఆపరేషన్‌ సముద్ర సేతు’ఆరంభించిన విషయం తెలిసిందే.

Published : 16 May 2020 11:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను సముద్రమార్గం ద్వారా స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత నౌకాదళం ‘ఆపరేషన్‌ సముద్ర సేతు’ ఆరంభించిన విషయం తెలిసిందే. తొలి దశలో మాల్దీవుల్లో చిక్కుకున్న వారిని ఐఎన్‌ఎస్‌ జలాశ్వ, ఐఎన్‌ఎస్‌ మగర్‌ నౌకల సాయంతో దాదాపు 900మందిని భారత్‌ తీసుకువచ్చారు. తాజాగా రెండో దశలో భాగంగా ఐఎన్‌ఎస్‌ జలాశ్వ మాల్దీవుల నుంచి మరో 588మందిని భారత్‌ తరలించేందుకు సిద్ధమైంది. అయితే ఈ నౌక శుక్రవారం సాయంత్రం మాల్దీవుల నుంచి కొచ్చి బయలుదేరాల్సి ఉండగా.. ప్రతికూల వాతావరణం కారణంగా ఆలస్యమైంది. వీరిలో ఎక్కువగా కేరళ, లక్షద్వీప్‌కు చెందినవారే ఉన్నారు. మొత్తం ప్రయాణికుల్లో 70మంది మహిళలు ఉండగా ఆరుగురు గర్భిణీలు, 21మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. తాజాగా వాతావరణం అనుకూలించడంతో ఈ ఉదయం మాల్దీవుల నుంచి ఐఎన్‌ఎస్‌ జలాశ్వ బయలుదేరింది. ఆదివారం నాడు కొచ్చి చేరే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని