మీకు అలా అనిపిస్తే ఆరోగ్యసేతు యాప్‌ వద్దు!

కరోనా వైరస్‌ బాధితులను గుర్తించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఆరోగ్య సేతు’ యాప్‌ సమస్యగా అనిపిస్తే డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిన

Published : 16 May 2020 22:51 IST

న్యూదిల్లీ: కరోనా వైరస్‌ బాధితులను గుర్తించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఆరోగ్య సేతు’ యాప్‌ సమస్యగా అనిపిస్తే డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిన అవసరం లేదని కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు. స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులందరూ ‘ఆరోగ్య సేతు’ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో రవి శంకర ప్రసాద్‌ ఈ విధంగా స్పందించారు.

‘ఆరోగ్య సేతు’ యాప్‌ కేవలం కరోనా వైరస్‌పై పోరాటం చేసేందుకే తప్ప ఎలాంటి సమాచారం దొంగిలించడానికి కాదని అన్నారు. దీని వల్ల సమీపంలో కరోనా వైరస్‌ బాధితులు ఉంటే తెలుసుకునేందుకు ఉపయోగపడటంతో పాటు, వారిని సులభంగా గుర్తించవచ్చన్నారు. చిన్న చిన్న రికార్డులన్నీ 30రోజుల్లో వాటంతటవే డిలీట్‌ అయిపోతాయని, మిగిలిన డేటా మొత్తం 180 రోజుల్లో డిలీట్‌ అవుతుందన్నారు.

రైళ్లలో ప్రయాణించే వారు తప్పనిసరిగా ఆరోగ్యసేతు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని అన్నారు. చాలా మందికి స్మార్ట్‌ఫోన్లు లేవు, అలాంటి వారి పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించగా, అలాంటి వారి కోసం కేంద్రం ఆరోగ్యసేతు -ఐవీఎస్‌ తీసుకొచ్చిందని వారు మిస్డ్ కాల్‌ ఇస్తే వివరాలు నమోదు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆరోగ్య సేతు యాప్‌ ఒక స్నేహితుడులాంటిదని ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని