మన స్నేహానికి మరింత బలాన్నిస్తుంది:మోదీ

కొవిడ్ 19 చికిత్సలో కీలకంగా మారిన వెంటిలేటర్లను భారత్‌కు సరఫరా చేస్తామని హామీ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు శనివారం భారత ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు.

Published : 16 May 2020 20:24 IST

దిల్లీ: కొవిడ్ 19 చికిత్సలో కీలకంగా మారిన వెంటిలేటర్లను భారత్‌కు సరఫరా చేస్తామని హామీ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు శనివారం భారత ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నిర్ణయం ఇరుదేశాల స్నేహాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 
‘డొనాల్డ్ ట్రంప్‌నకు ధన్యవాదాలు. మీ నిర్ణయం భారత్‌, యూఎస్‌ స్నేహానికి మరింత బలాన్ని చేకూర్చుతుంది. ఈ మహమ్మారి మీద మనమంతా కలిసికట్టుగా పోరాడుతున్నాం. అలాంటి సమయాల్లో మన ప్రపంచాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు, కొవిడ్‌ 19 నుంచి విముక్తి పొందేలా చూసేందుకు అన్ని దేశాలు కలిసి పనిచేయడం అత్యవసరం’ అని మోదీ ట్వీట్ చేశారు.  
అయితే గతంలో ట్రంప్ అభ్యర్థన మేరకు కొవిడ్ 19 చికిత్స నిమిత్తం భారత్ హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను సరఫరా చేసిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ తయారీకి ఇరుదేశాలు కలిసి పనిచేస్తాయని, మహమ్మారి మీద పోరులో భారత్‌కు అండగా ఉంటామని ఇప్పటికే ట్రంప్‌ ప్రకటించారు. అలాగే అమెరికాలో ఉన్న భారతీయుల్లో గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారని ప్రశంసలు కురించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని