కేంద్రం పూర్తి అండగా ఉంటుంది: షా

పెనుతుపానుగా బలపడిన ‘అంపన్‌’ను ఎదుర్కోవడానికి పశ్చిమబంగా‌, ఒడిశా రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మంగళవారం సమీక్షించారు. ఈ మేరకు ఆయన పశ్చిమ బంగా.......

Published : 19 May 2020 14:20 IST

అంపన్‌ తుపాను నేపథ్యంలో ప్రభావిత రాష్ట్రాలకు కేంద్రం హామీ

దిల్లీ: పెనుతుపానుగా బలపడిన ‘అంపన్‌’ను ఎదుర్కోవడానికి పశ్చిమబంగా‌, ఒడిశా రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మంగళవారం సమీక్షించారు. ఈ మేరకు ఆయన పశ్చిమ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో ఫోన్‌ ద్వారా మాట్లాడారు. తుపానును సమర్థంగా ఎదుర్కొనేందుకు కేంద్రం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు.

సోమవారం పెనుతుపాను రూపం సంతరించుకున్న అంపన్‌.. తీవ్ర బీభత్సం సృష్టించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. గత రెండు దశాబ్దాల్లో సంభవించిన పెనుతుపానుల్లో ఇది రెండోదని.. తీర ప్రాంత జిల్లాలో భారీ నష్టం మిగిల్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. బుధవారం మధ్నాహ్నం పశ్చిమబంగాలోని దిగా, బంగ్లాదేశ్‌లోని హతియా దీవుల మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. లక్షలాది మందిని తరలించే అవసరం రావొచ్చునని భావిస్తున్నారు. ఒడిశాలో దాదాపు 12 జిల్లాలు తీవ్రంగా ప్రభావితం కానున్నట్లు అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి..

కొనసాగుతున్న ‘అంపన్‌’ తుపాను

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని