అమెరికాలో శునకానికి గౌరవ డాక్టరేట్‌ 

అమెరికాలోని వర్జీనియా టెక్‌ యూనివర్సిటీ ఓ శునకాన్ని గౌరవ డాక్టరేట్‌ డిగ్రీతో సత్కరించింది. ఆ కుక్క పేరు మూస్‌ డేవిస్‌. 2020 సంవత్సరానికి గానూ ఆన్‌లైన్‌లో డిగ్రీ పూర్తి చేసిన వారికి యూనివర్సిటీ స్నాతకోత్సవం.....

Published : 21 May 2020 03:08 IST

న్యూయార్క్‌ : అమెరికాలోని వర్జీనియా టెక్‌ యూనివర్సిటీ ఓ శునకాన్ని గౌరవ డాక్టరేట్‌ డిగ్రీతో సత్కరించింది. ఆ శునకం పేరు మూస్‌ డేవిస్‌. 2020 సంవత్సరానికి గానూ ఆన్‌లైన్‌లో డిగ్రీ పూర్తి చేసిన వారికి యూనివర్సిటీ స్నాతకోత్సవం నిర్వహించింది. ఈవేడుకలో ఎనిమిదేళ్ల మూస్‌కు వెటర్నరీ మెడిసిన్‌లో గౌరవ డాక్టరేట్‌ లభించింది. ఈ విషయాన్ని యూనివర్సిటీ పాలక మండలి ఓ ప్రకటనలో పేర్కొంది. డాక్టర్‌ మూస్‌ ఇటీవలె ప్రస్టేట్‌ క్యాన్సర్‌ బారిన పడింది. తీవ్ర అనారోగ్యంతో భాదపడుతున్నప్పటికీ విద్యార్థులకు, సిబ్బందికి సహాయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఎన్నో కార్యక్రమాల్లో తన సేవలను గుర్తిస్తూ గౌరవ డాక్టరేట్ ఇచ్చినట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. యూనివర్సిటీలో 2014 నుంచే మూస్‌ సేవలందిస్తోంది. మూస్‌ తన ఆరేళ్ల ఉద్యోగ కాలంలో 7500కుపైగా కౌన్సెలింగ్‌ సేషన్లు, 500కుపైగా ట్రీచ్‌ ఈవెంట్లలో సేవలు అందించినట్లు అధికారులు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని