‘మా రాష్ట్రానికి శ్రామిక్‌ రైళ్లు పంపొద్దు’

పెను తుపాను సృష్టించిన బీభత్సం నేపథ్యంలో తమ రాష్ట్రానికి మే 26 వరకు శ్రామిక్‌ రైళ్లను పంపొద్దని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రైల్వే శాఖను కోరారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ సిన్హా రైల్వే ఛైర్మన్‌ వీ.కే.యాదవ్‌కు లేఖ రాశారు.......

Published : 23 May 2020 14:15 IST

కేంద్రానికి కోరిన మమతా బెనర్జీ

దిల్లీ: పెను తుపాను సృష్టించిన బీభత్సం నేపథ్యంలో తమ రాష్ట్రానికి మే 26 వరకు శ్రామిక్‌ రైళ్లను పంపొద్దని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రైల్వే శాఖను కోరారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ సిన్హా రైల్వే ఛైర్మన్‌ వీ.కే.యాదవ్‌కు లేఖ రాశారు. తుపాను కారణంగా రాష్ట్రంలో మౌలిక వసతులు పూర్తిగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. దీంతో జిల్లా యంత్రాంగాలన్నీ సహాయ, పునరావాస కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో వలసకూలీల కోసం ప్రత్యేకంగా నడుపుతున్న శ్రామిక్‌ రైళ్లను అనుమతించే అవకాశం లేదని స్పష్టం చేశారు.

తుపాను బీభత్సానికి మరణించిన వారి సంఖ్య ఆ రాష్ట్రంలో 85కు చేరింది. మరోవైపు మూడు రోజులు గడిచినా సాధారణ పరిస్థితుల్ని నెలకొల్పడంలో ప్రభుత్వం విఫలమైందంటూ కొన్ని చోట్ల ప్రజలు ఆందోళనకు దిగారు. ఈ పరిణామాల నేపథ్యంలో నేడు సీఎం మమతా బెనర్జీ తుపాను ప్రభావిత జిల్లా దక్షిణ 24 పరాగణాలో పర్యటించనున్నారు. అధికారిక అంచనాల ప్రకారం తుపాను వల్ల ఇప్పటి వరకు 1.5 కోట్ల మంది ప్రత్యక్షంగా ప్రభావితమయ్యారు. దాదాపు 10 లక్షల ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఇంకా చాలా ప్రాంతాల్లో విద్యుత్తు, మొబైల్‌ సేవల్ని పునరుద్ధరించాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని