విద్యార్థుల తరఫున డిగ్రీ పట్టాలు అందుకున్న రోబోలు

ఫిలిప్పిన్స్‌లోని మనీలాలో ఓ విద్యాలయం తమ విద్యార్థులకు వినూత్న పద్ధతిలో డిగ్రీ పట్టాలను అందజేసింది. కరోనా నేపథ్యంలో స్నాతకోత్సవానికి హాజరు కాలేని విద్యార్థులకు బదులు రోబోలకు పట్టాలు అందించింది. ఇందుకోసం కెయాంటో విద్యాలయం ప్రత్యేక

Published : 24 May 2020 00:52 IST

ఫిలిప్పిన్స్‌లోని ఓ విద్యాలయంలో వినూత్న కార్యక్రమం

మనీలా: ఫిలిప్పిన్స్‌లోని మనీలాలో ఓ విద్యాలయం తమ విద్యార్థులకు వినూత్న పద్ధతిలో డిగ్రీ పట్టాలను అందజేసింది. కరోనా నేపథ్యంలో స్నాతకోత్సవానికి హాజరు కాలేని విద్యార్థులకు బదులు రోబోలకు పట్టాలు అందించింది. ఇందుకోసం కెయాంటో విద్యాలయం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఒక్కో రోబో ఒక్కో విద్యార్థికి ప్రాతినిథ్యం వహించేలా అసెంబుల్‌ చేసింది. తమకు ప్రాతినిథ్యం వహిస్తున్న రోబోలను విద్యార్థులు ఇంటి నుంచే రిమోట్‌ ద్వారా ఆపరేట్‌ చేస్తూ పట్టాలు అందుకున్నారు. ఇలా దాదాపు 170 మంది విద్యార్థులు రోబోల ద్వారా పట్టభద్రులయ్యారు. వీరంతా సైబర్‌ విద్యలో డిగ్రీ పొందారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని