1758 మంది పోలీసులకు కరోనా!

కరోనా వైరస్‌ మహమ్మారి మహారాష్ట్రలో మరణమృదంగం మోగిస్తోంది. దేశంలోనే అత్యధికంగా కొవిడ్‌-19 తీవ్రత ఇక్కడ కొనసాగుతోంది. అయితే, మహమ్మారి విజృంభణ సమయంలోనూ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు కొవిడ్‌-19 బారినపడటం కలవరపెడుతోంది.

Published : 24 May 2020 13:36 IST

ముంబయి: కరోనా వైరస్‌ మహమ్మారి మహారాష్ట్రలో మరణమృదంగం మోగిస్తోంది. దేశంలోనే అత్యధికంగా కొవిడ్‌-19 తీవ్రత ఇక్కడ కొనసాగుతోంది. అయితే, మహమ్మారి విజృంభణ సమయంలోనూ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు కొవిడ్‌-19 బారినపడటం కలవరపెడుతోంది. తాజాగా గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 87మంది పోలీసులు ఈ వైరస్‌ బారినపడ్డారు. దీంతో రాష్ట్రంలో వైరస్‌ సోకిన పోలీసుల సంఖ్య 1758కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 18మంది మృత్యువాతపడ్డారని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. కరోనా సోకిన పోలీసుల్లో ఇప్పటివరకు 673మంది కోలుకోగా ప్రస్తుతం 1067మంది చికిత్స పొందుతున్నట్లు ప్రకటించారు. కరోనా సోకిన పోలీసుల్లో 183 మంది ఉన్నతాధికారులు కాగా మరో 1575 కిందిస్థాయి సిబ్బంది ఉన్నారు.

ఇదిలా ఉంటే, దేశంలో నమోదవుతున్న కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల్లో 36శాతం మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఆదివారం నాటికి మహారాష్ట్రలో మొత్తం 47,190 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 1577మంది మృత్యువాతపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని