ఆస్ట్రేలియాను కుదిపేసిన ప్రచండ తుపాను

పశ్చిమ ఆస్ట్రేలియాను ఆదివారం ప్రచండ తుపాన్‌ కుదిపేసింది. తీరంలో గంటకు 100 కిలోమీటర్లు పైగా వేగంతో ఉద్ధృతమైన గాలులు వీచాయి. సుమారు 50 వేల ఇళ్లు, దుకాణాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఒక్క పెర్త్‌ నగరంలోనే

Published : 25 May 2020 00:37 IST

సిడ్నీ: పశ్చిమ ఆస్ట్రేలియాను ఆదివారం ప్రచండ తుపాన్‌ కుదిపేసింది. తీరంలో గంటకు 100 కిలోమీటర్లు పైగా వేగంతో ఉద్ధృతమైన గాలులు వీచాయి. సుమారు 50 వేల ఇళ్లు, దుకాణాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఒక్క పెర్త్‌ నగరంలోనే 37 వేల ఇళ్లలో అంధకారం నెలకొంది. ఆస్ట్రేలియాలో సహజంగా నైరుతి దిశ నుంచి తుపానులు తీరాన్ని తాకుతుంటాయి. ప్రస్తుత తుపాన్‌ వాయవ్యం నుంచి వచ్చి బీభత్సం సృష్టించింది. దక్షిణ హిందూ మహాసముద్రంలోని మాంగా తుపాను ప్రభావం ఇందుకు జత కలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని