ఈద్‌ శుభాకాంక్షలు తెల్పిన ప్రధాని మోదీ

ఈద్‌ ఉల్‌ ఫితర్‌ పర్వదినం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఈ ఉదయం దేశప్రజలకు శుభాకాంక్షలు తెలియచేశారు.

Updated : 25 May 2020 10:53 IST

దిల్లీ: ఈద్‌ ఉల్‌ ఫితర్‌ పర్వదినం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దేశప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘ఈద్‌ ముబారక్‌! ఈద్‌ ఉల్‌ ఫితర్‌ శుభాకాంక్షలు. ఈ పండుగ సందర్భంగా ప్రజల్లో కరుణ, సౌభ్రాతృత్వం, సామరస్యం విస్తరించాలని కోరుకుంటున్నా. అందరికీ ఆరోగ్యం, సంపద సమకూరాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని ఆయన ట్వీట్‌ చేశారు. గతనెలలో రంజాన్‌ మొదలైన సందర్భంగా.. కొవిడ్‌ నిబంధనలకు పాటించాలని ముస్లిం సోదరులకు అవగాహన కల్పించిన మతపెద్దలకు ఆయన కృతజ్ఞతలు తెలియచేశారు.

‘‘క్లిష్ట పరిస్థితుల మధ్య మనం రంజాన్ పవిత్ర మాసాన్ని నిర్వహించుకోవాల్సి వచ్చింది. ఈ సారి రంజాన్‌ పండుగను ఇన్ని సమస్యల మధ్య జరుపుకోవాల్సి వస్తుందని ఎన్నడూ అనుకోలేదు. కొవిడ్‌-19 మహమ్మారి నివారించి వచ్చే సంవత్సరం రంజాన్‌ను ఆనందంగా జరుపుకోవాలని ప్రార్థిద్దాం’’ అంటూ ఇటీవలి మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో మోదీ ఆకాంక్షించారు. ఆదివారం చంద్రదర్శనం కావటంతో, దేశంలో ఈద్‌ పండుగను నేడు జరుపుకోవాలంటూ దిల్లీ జామా మసీదు షాహీ ఇమామ్‌ అహ్మద్‌ షా బుకారీ ప్రకటించారు. అయితే దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో... ముస్లింలు ఇంటి వద్దనే ఈద్‌ పండుగను నిర్వహించుకోవాల్సి వచ్చింది. లాక్‌డౌన్‌ సందర్భంగా  ప్రార్ధనలను ఇళ్లలోనే నిర్వహంచుకోవాలని మతపెద్దలు ఫత్వా జారీచేసిన సంగతి తెలిసిందే.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని