జూన్‌ 30 వరకు ‘హిమాచల్‌’లో లాక్‌డౌన్‌!

దేశంలో కరోనా వైరస్‌ రోజురోజుకీ ఉద్ధృతమవుతోంది. ఈ ఒక్క రోజే దేశ వ్యాప్తంగా 6977 కేసులు నమోదు కావడం కలకలం.......

Published : 25 May 2020 22:14 IST


సిమ్లా: దేశంలో కరోనా వైరస్‌ రోజురోజుకీ ఉద్ధృతమవుతోంది. ఈ ఒక్క రోజే దేశ వ్యాప్తంగా 6977 కేసులు నమోదు కావడం కలకలం రేపుతున్న వేళ హిమాచల్‌ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ను కట్టడి చేయడమే లక్ష్యంగా విధించిన లాక్‌డౌన్‌ను  రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో జూన్‌ 30 వరకు కొనసాగించనున్నట్టు ప్రకటించింది. భాజపా పాలిత రాష్ట్రమైన హిమాచల్‌ప్రదేశ్‌లో హమీర్‌పూర్‌, షోలాన్‌ జిల్లాల్లో కేసులు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఈ రెండు జిల్లాల్లో జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుందని కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు.  దేశవ్యాప్తంగా ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ కొనసాగనున్న నేపథ్యంలో ఇప్పటికే కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చింది. విమాన సర్వీసులకు సైతం అనుమతిచ్చిన వేళ ఇక్కడ లాక్‌డౌన్‌ను పొడిగించడం గమనార్హం. గత 30 రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో రెడ్‌ జోన్ల నుంచి దాదాపు 10వేల మందికి పైగా ప్రజలు హమీర్‌పూర్‌కు వచ్చారని కలెక్టర్‌ తెలిపారు. ఈ రెండు జిల్లాల్లో కొన్ని గంటల పాటు నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు ప్రజలకు కొన్ని గంటల పాటు కర్ఫ్యూ సడలించనున్నారు. 

హిమాచల్‌ప్రదేశ్‌లో ఇప్పటివరకు 217 కేసులు నమోదయ్యాయి. వీరిలో 62 మంది కోలుకోగా.. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని