భారత్‌కు సాయం కొనసాగుతుంది: చైనా

కరోనా వైరస్‌ మహమ్మారిపై చేస్తున్న పోరులో భారత్‌కు సాయం కొనసాగుతుందని చైనా మరోసారి స్పష్టం చేసింది. వైరస్‌ పోరులో సహకారం, సంఘీభావం ఎంతో కీలక ఆయుధాలుగా పనిచేస్తాయని భారత్‌లోని చైనా రాయబారి సన్‌ వీడాంగ్‌ అభిప్రాయపడ్డారు

Published : 26 May 2020 11:09 IST

దిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారిపై చేస్తున్న పోరులో భారత్‌కు సాయం కొనసాగుతుందని చైనా మరోసారి స్పష్టం చేసింది. వైరస్‌పై పోరులో సహకారం, సంఘీభావం ఎంతో కీలక ఆయుధాలుగా పనిచేస్తాయని భారత్‌లోని చైనా రాయబారి సన్‌ వీడాంగ్‌ అభిప్రాయపడ్డారు. దీనిలో భాగంగా భారత్‌కు చైనా సహకారం కొనసాగుతుందన్నారు. చైనాలోని జాక్‌మా, అలీబాబా ఫౌండేషన్లు భారత్‌కు ప్రకటించిన విరాళంలో భాగంగా రెండో దఫా వెంటిలేటర్లు, పీపీఈ కిట్లతో పాటు ఇతర వైద్య సామగ్రి దిల్లీకి చేరుకుందని వీడాంగ్‌ వెల్లడించారు. అయితే, తాజాగా భారత్‌లో కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడున్న చైనీయులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చైనా ప్రకటించింది. స్వదేశానికి వచ్చేందుకు సుముఖంగా ఉన్న వారు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని భారత్‌లోని చైనీయులకు సూచించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా వెల్లడించింది.

ఇదిలా ఉంటే, భారత్‌లో కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా మంగళవారం నాటికి దేశంలో లక్షా 45వేల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని