చిన్నారులకు మాస్కులు ప్రమాదమా?

కరోనా వైరస్‌ నివారణలో భాగంగా ప్రతిఒక్కరు భౌతిక దూరం పాటించడంతోపాటు మాస్కులు ధరించడమే ఏకైక నివారణ మార్గమని అంతర్జాతీయంగా ...

Updated : 26 May 2020 15:01 IST

దిల్లీ: కరోనా వైరస్‌ నివారణలో భాగంగా ప్రతిఒక్కరు భౌతిక దూరం పాటించడంతోపాటు మాస్కులు ధరించడమే ఏకైక మార్గమని అంతర్జాతీయ నిపుణలు చెబుతున్న మాట. అయితే మరి చిన్నారులకు మాస్కులు ఎంతవరకు అవసరం అనే విషయంపై చర్చ కొనసాగుతోంది. అయితే రెండేళ్లలోపు చిన్నారులకు మాస్కులు అత్యంత ప్రమాదకరమని జపాన్‌ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇవి ధరించడం వల్ల చిన్నారులకు శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని జపాన్‌ పిడియాట్రిక్‌ అసోసియేషన్‌ వెల్లడించింది. సాధారణంగా చిన్నారుల్లో శ్వాసమార్గం ఇరుకుగా ఉంటుందని.. మాస్కు ధరించినప్పుడు గాలి పీల్చితే అది గుండెపై భారం పెంచుతుందని తెలిపింది. అంతేకాకుండా అది ఒక్కోసారి వడదెబ్బకు కూడా కారణమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ కారణంగా 2 సంవత్సరాలలోపు పిల్లలు మాస్కు వాడొద్దని సూచించింది. జపాన్‌లో పాఠశాలలు పునఃప్రారంభం సందర్భంగా తల్లిదండ్రులకు ఈ విజ్ఞప్తి చేసింది. అయితే ఇప్పటివరకూ చిన్నారులు కొవిడ్‌ బారినపడి ప్రమాదకరంగా మారిన ఘటనలు జపాన్‌లో తక్కువేనని..కేవలం వారి కుటుంబ సభ్యులనుంచే ఈ వైరస్‌ సంక్రమిస్తున్నట్లు తెలిపింది.

జపాన్‌లో వైరస్‌ తీవ్రత తగ్గడంతో అక్కడ విధించిన అత్యయికస్థితిని ఎత్తివేస్తున్నట్లు తాజాగా జపాన్‌ ప్రధానమంత్రి షింజో అబే ప్రకటించారు. అయితే, దేశంలో రెండో దఫా వైరస్‌ తీవ్రత పెరిగితే మాత్రం మరోసారి అత్యయికస్థితి కొనసాగిస్తామని ముందుగానే హెచ్చరించారు. ఇదిలా ఉంటే, అమెరికా వ్యాధి నియంత్రణ కేంద్రం(సీడీసీ), అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ పిడియాట్రిక్స్‌ కూడా రెండు సంవత్సరాలలోపు చిన్నారులు మాస్కులు ధరించవద్దని ఇదివరకే స్పష్టంచేశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు