మనం చాలా ‘హాట్‌’ గురూ..!

దేశవ్యాప్తంగా వీస్తున్న వడగాలులు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. మంగళవారం ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన తొలి 15 నగరాల్లో 10 భారత్‌లోనే ఉండడం గమనార్హం. ఎల్‌ డొరాడో వెబ్‌సైట్‌ వివరాల ప్రకారం రాజస్థాన్‌లోని.....

Updated : 27 May 2020 10:23 IST

ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న 15నగరాల్లో 10మనవే!

దిల్లీ: దేశవ్యాప్తంగా వీస్తున్న వడగాలులు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. మంగళవారం ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన తొలి 15 నగరాల్లో 10 భారత్‌లోనే ఉండడం గమనార్హం. ఎల్‌ డొరాడో వెబ్‌సైట్‌ వివరాల ప్రకారం రాజస్థాన్‌లోని చురు 50 డిగ్రీల సెల్సియస్‌తో తొలిస్థానంలో నిలిచింది. దిల్లీ 47.6 డిగ్రీలు, బికనెర్ 47.4, గంగానగర్ 47‌, ఝాన్సీ 47, పిలానీ 46.9 డిగ్రీల సెల్సియస్‌తో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మహారాష్ట్రలో నాగ్‌పూర్‌ సోనేగావ్‌ 46.8, అకోలా 46.5 డిగ్రీల సెల్సియస్‌తో జాబితాలో ఉన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఝాన్సీతో పాటు బాందాలోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హరియాణాలోని హిసార్‌ కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన నగరాల సరసన నిలిచింది. 

గత పదేళ్లలో మే నెలలో చురులో నమోదైన ఉష్ణోగ్రతల్లో ఈసారి నమోదైన 50 డిగ్రీల సెల్సియస్‌ రెండో అత్యధికం. గతంలో మే 19, 2016న అత్యధికంగా 50.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మే 22న నుంచి చురులో రోజురోజుకీ ఎండల తీవ్రత పెరుగుతూ వస్తోంది. దీంతో వడగాలులు ప్రారంభమయ్యాయి. వీటితో పాటు రాజస్థాన్‌లోని కోటా, జైసల్మేర్‌లోనూ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌ను దాటుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని